నిత్యం యాపిల్ ను ఇలా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు.. తెలుసా?

ఇటీవల కాలంలో అధిక బరువుతో( Over Weight ) బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.

ఆహారపు అలవాట్లు, జీవన శైలి లో చోటు చేసుకున్న మార్పులు కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఉండాల్సిన దానికంటే భారీగా బరువు పెరిగిపోతున్నారు.

అధిక బరువు అనేక రోగాలకు మూలం.కాబట్టి శరీర బ‌రువును అదుపులోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం.

అయితే వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.

యాపిల్( Apple ) కూడా ఆ కోవకే చెందుతుంది.ఏడాది పొడవునా లభించే యాపిల్ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా యాపిల్ అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. """/" / వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలని భావిస్తున్న వారికి కూడా యాపిల్ అద్భుతంగా తోడ్పడుతుంది.

ముఖ్యంగా నిత్యం యాపిల్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు.

అందుకోసం ముందుగా ఒక చిన్న యాపిల్ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.

అలాగే రెండు లేదా మూడు పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలను( Garlic ) తీసుకుని తురుముకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో యాపిల్ తురుము మరియు వెల్లుల్లి తురుము వేసుకోవాలి.

ఆపై ఒకటిన్నర గ్లాసు బాగా మరిగించిన వాటర్ కూడా పోసి స్పూన్ తో కలిపి మూత పెట్టి అరగంట పాటు వదిలేయాలి.

"""/" / అర‌గంట‌ తర్వాత వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొద్దిగా తేనె కలిపి సేవించాలి.

ఈ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కనుక తీసుకుంటే మీ మెటబాలిజం రేటు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.

కేలరీలు కరిగి వేగం పెరుగుతుంది.దాంతో మీ శరీర బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.

వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ డ్రింక్ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం తో పాటు నిత్యం అరగంట పాటు వ్యాయామం చేయండి.

అలాగే కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, నట్స్ అండ్ సీడ్స్, సీజనల్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోండి.

చెడు ఆహారాలను దూరం పెట్టండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?