అలా నిద్రిస్తే ముఖంపై ముడతలు రావడం ఖాయం..జాగ్రత్త!
TeluguStop.com
వయసు ముదిరే కొద్దీ ఎవ్వరికైనా ముడతలు రావడం చాలా కామన్.కానీ, కొందరు చిన్న వయసులోనే ముడతల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.
ముడతలు అందాన్ని తగ్గిస్తాయి.వయసును పెంచి చూపిస్తాయి.
అందుకే ముడతలు అంటేనే అందరూ తెగ భయపడి పోతుంటారు.అయితే తక్కువ వయసులోనే ముడతలు రావడానికి మనం చేసే కొన్ని కొన్ని పొరపాట్లు కూడా కారణాలు అవుతుంటాయి.
మరి ఆలస్యమెందుకు ఆ పొరపాట్లు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.సాధారణంగా కొందరు నిద్రించే సమయంలో పక్కకు లేదా బోర్లా పడుకుంటారు.
అయితే పక్కకి తిరిగి పడుకునేటప్పుడు.ఎటు వైపు ఎక్కువగా నిద్రిస్తారో అటు బుగ్గ మీద, ఆ వైపు గడ్డం మీద ముడతలు, సన్నని చారలు పడతాయి.
మరియు బోర్లా తిరిగి నిద్రిస్తే నుదుటి మీదంతా ముడతలు వస్తాయి.అందు వల్లనే ఎప్పుడూ వెల్లకిలా పడుకోవడానికి ప్రయత్నించాలి.
అలాగే కొందరు కాఫీ, టీలను తెగ తాగేస్తారు.ఈ అలవాటు ముడతలు త్వరగా రావడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
కాబట్టి.కాఫీ, టీలను ఎంత లిమిట్‌గా తీసుకుంటె మీ చర్మానికి మరియు ఆరోగ్యానికి అంత మంచిది.
"""/" /
సన్ స్క్రీన్ వాడే అలవాటు చాలా అంటే చాలా మందికి ఉండదు.
అయితే సన్ స్క్రీన్ వాడకుండా బయటకు వెళ్తే ఎండల ప్రభావం చర్మంపై పడి ముడతలు త్వరగా వచ్చేస్తాయి.
సో.ఏ క్రీమ్ వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్‌ను కంపల్సరీగా యూజ్ చేయాలి.
కొందరు తెలిసో, తెలియకో తరచూ ఫేస్ వాష్ చేసుకుంటారు.కానీ, అతిగా ఫేష్ వాష్ చేసుకుంటే చర్మంపై ఉండే న్యాచురల్ ఆయిల్స్ తొలగిపోయి.
చర్మంపై ముడతలు వస్తాయి.అందుకే రోజుకు మూడు సార్లకు మించి ఫేస్ వాష్ చేసుకోరాదు.
ఇక డైట్‌లో ఏ ఫుడ్స్ పడితే ఆ ఫుడ్స్ కాకుండా.తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటివి ఉండేలా చూసుకోవాలి.
అప్పుడే ముడతల సమస్యకు దూరంగా ఉంటారు.
ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ సూపర్ స్టార్స్.. ఈ ఫోటో ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అంటూ?