ఆ రైల్వే కోచ్‌లో కూర్చుంటే దిగాల‌నిపించ‌దు... ప్ర‌త్యేక‌త‌లివే..

ముంబై-పూణె డెక్కన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును చూసిన‌వారు దానిలో ఒక్క‌సారైనా ప్ర‌యాణించాల‌నుకుంటారు.దీనిని కొంకణ్ రైల్వే న‌డుపుతోంది.

ఈ రైలుకున్న ప్రత్యేకత‌ల‌ కారణంగా వార్తల్లో నిలిచింది.ఈ రైలులో విస్టాడోమ్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

ఈ కోచ్‌లు లగ్జరీ సౌకర్యాలకు ప్రసిద్ధి చెందాయి.బయటి దృశ్యాలను చూడటానికి సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద కిటికీలు, పారదర్శక పైకప్పు, అబ్జర్వేషన్ లాంజ్ లాంటి సౌక‌ర్యాలున్నాయి.

ముంబై మరియు పూణే మధ్య నడిచే డెక్కన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణించవచ్చు.

భారతీయ రైల్వే విస్టాడోమ్ కోచ్‌ల‌ను ప్రత్యేకంగా రూపొందించింది.ఈ కోచ్‌లలో కుర్చీల నుండి టాయిలెట్ల వరకు అన్నీ అత్యాధునికంగా తయారు చేశారు.

రైలు కోచ్ పైకప్పుకు అద్దాలు అమ‌ర్చారు.దీంతో పైకప్పు పారదర్శకంగా ఉంటుంది.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడితే.ఓ ప్రత్యేక అనుభూతిని క‌లుగుతుంది.

అలాగే కోచ్‌లో పెద్ద కిటికీలు ఉంటాయి.ఇంతే కాకుండా రైలులోని సీట్లు 180 డిగ్రీల వరకు తిప్పవచ్చు.

ప్ర‌యాణీకులు నిలబడటానికి వీలుగా అబ్జర్వేషన్ లాంజ్ ఉంది.ఈ కోచ్ 180 కిలోమీట‌ర్ల వేగాన్ని సులభంగా అందుకోగలిగేలా ప్రత్యేకంగా రూపొందించారు.

ఈ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతమైన సీటుపై కూర్చుని బయటి దృశ్యాల‌ను చూడగలుగుతారు.

అలాగే రైలులో వైఫై స‌దుపాయం కూడా ఉంది.కోచ్‌లోని ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వారి ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది.

ప్రజల సంపూర్ణ మద్ధతు బీజేపీకే..: కిషన్ రెడ్డి