దీపావళి రోజున ఈ జంతువులను చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
TeluguStop.com
మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము.
దీపావళి పండుగను ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకొనున్నారు.
దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు కనుక దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.
అయితే ఎంతో పవిత్రమైన ఈ పండుగ రోజు కొన్ని రకాల జంతువులను చూస్తాము అయితే ముఖ్యంగా ఈ జంతువులను చూడటం వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి పూజ తర్వాత సాయంత్రం మనకు గుడ్లగూబ కనపడితే ఎంతో శుభప్రదంగా భావిస్తారు.
గుడ్లగూబను సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు కనుక సంపదను కలుగజేస్తుందని తెలుస్తుంది.అందుకే దీపావళి రోజు గుడ్లగూబను చూడటం ఎంతో మంచిదని పండితులు చెబుతుంటారు.
సాధారణంగా మనం పిల్లిని అపశకునంగా భావిస్తారు.ఏదైనా పండుగలు శుభకార్యాల సమయంలో పిల్లి వస్తే కనుక ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతాము.
అయితే పిల్లి దీపావళి పండుగ రోజున మనకు కనబడితే అది అదృష్టానికి సంకేతము అని చెప్పవచ్చు.
"""/" /
సాధారణంగా బల్లులను చూస్తే కొందరు ఆమడ దూరం పరిగెడుతారు.ఇలా బల్లులను దీపావళి పండుగ రోజు చూడటం వల్ల శుభపరిణామాలు కలుగుతాయని భావిస్తారు.
ఇలా హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపావళి పండుగ రోజు ఈ జంతువులను చూడటం వల్ల మన ఇంటికి సంపద కలుగుతుందని సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు.
ఇక దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి పూజలు చేసి వివిధ రకాల తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తాము.
మీడియా ముందుకు వస్తే తప్ప ఇచ్చిన మాట గుర్తు లేదా దేవర.. ఎన్టీఆర్ సాయం పై విమర్శలు!