వైరల్ వీడియో: పానీ పూరి వ్యాపారి మిమిక్రీ చూస్తే ఫిదా..

సాధారణంగా చాలామంది తమ పనిని ఒక భారం లాగా భావిస్తూ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తుంటారు.

ఆ నిరాశలోనే ఉండి డబ్బు కోసమే పని చేస్తారు.కానీ కొంతమంది మాత్రం తమ పనిని ఆడుతూ పాడుతూ చేసేస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు.

కొందరు కూరగాయలు అమ్ముతూ పాటలు పాడుతూ లైఫ్ ని హ్యాపీగా మార్చేసుకుంటే మరి కొంత మంది ఆటల ఆడుతూనే పని చేస్తుంటారు.

తాజాగా అలాంటి ఒక యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ యువకుడు పానీపూరీ అమ్మే విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పానీపూరీ అమ్ముతున్నాడు.

మన దేశంలో ఒగ్గీ అనే కార్టూన్ క్యారెక్టర్ టామ్ అండ్ జెర్రీ లెవెల్ లో పాపులర్ అయ్యింది.

అయితే ఈ పానీ పూరి యువకుడు ఒగ్గీలా( Oggila ) మిమిక్రీ చేస్తూ తన సరుకులు అమ్ముతున్నాడు.

"""/" / ఆయన ఒక బండి మీద పానీ పూరి( Pani Puri ) పెట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ, మైక్ తో అందరిని ఆకర్షిస్తున్నాడు.

తన పానీ పూరి ఎంతో రుచికరంగా ఉంటుందని అందరినీ ఆహ్వానిస్తున్నాడు.ఆయన చేసే మిమిక్రీ చూసి చిన్న పిల్లలు ఫిదా అవుతున్నారు.

అంతేకాదు ఆ యువకుడి దగ్గర పానీపూరి తినేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.ఈ యువకుడు నీకు అందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది.

అతడి వీడియోను లక్షలాది మంది చూశారు. """/" / ఆయన ఆ వీడియోలో "హే భయ్యా, పానీ పూరి, అవి మసాలాతో నిండి ఉన్నాయి.

నేను కూడా తింటాను భయ్యా" అని చెప్పాడు.ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరొక వీడియోలో, ఆయన బిర్యానీ అమ్ముతున్నట్లు నటిస్తూ, ఒగ్గీ కార్టూన్ క్యారెక్టర్ వాయిస్‌ను మిమిక్రీ చేశాడు.

ఈ యువకుడి పేరు జితేందర్ కుమార్.ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్.

పనిచేస్తున్నప్పుడు ఒగ్గీ వాయిస్‌ను అనుకరిస్తూ వీడియోలు చేసి పంచుకుంటూ ఉంటాడు.ఈ వీడియో చూసి చాలామంది అతడిని పొగుడుతున్నారు.

ఇండియాలో చాలామంది ఇలాంటి టాలెంటెడ్ యంగ్ స్టార్స్ ఉన్నారని పేర్కొంటున్నారు.

ఒక్కసారైనా ఎన్టీఆర్ గురించి అడగొచ్చు కదా బాలయ్య.. మరి ఇంత దారుణమా?