వావ్‌.. తాతకు ఈ కోతి ఎలా సాయం చేసిందో చూస్తే ఫిదా అయిపోతారు..

సాయం చేయాల‌నే ఆలోచ‌న చాలా గొప్ప‌ది.అది చిన్న‌దా పెద్ద‌దా అని కాకుండా దాన్ని ఆచ‌రించి చూపెట్టేవారు ఆ సాయం పొందిన‌వారి గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతారు.

త‌మ‌కు సాయం చేసిన వారు చిన్న‌వారైనా లేదా పెద్ద వారైనా స‌రే వారిని అత్యంత గౌర‌వంగా చూస్తారు.

ఎందుకంటే మ‌నం బాగున్న‌ప్పుడు పొగిడే వారి క‌న్నా ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు సాయం చేసే చేతులు చాలా గొప్ప‌వి.

అయితే మ‌నుషులు మ‌నుషుల‌కు సాయం చేయ‌డం మ‌నం చూస్తున్నాం.అదే మ‌నుషులు అప్పుడ‌ప్పుడు జంతువుల‌కు సాయం చేయ‌డాన్ని కూడా మ‌నం చూస్తున్నాం.

కానీ కోతులు మ‌నుషుల‌కు సాయం చేయ‌డం మీరెప్పుడైనా చూశారా చూడ‌కుంటే మాత్రం ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోను చూస్తే మీరు కూడా వావ్ అంటారేమో.

సాధార‌ణంగా కోతుల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగానే వైర‌ల్ అవుతాయి.కానీ అందులో చాలా వ‌ర‌కు కోతి చేష్ట‌ల‌కు సంబంధించిన‌వే ఉంటాయి.

కానీ ఇప్పుడు మాత్రం ఓ కోతిఎంతో బాధ్య‌తాయుతంగా ప్ర‌వ‌ర్తించిన తీరు మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ వృద్ధుడు న‌డుచుకుంటూ మెల్లి మెల్లిగా వెళ్ల‌డం మ‌నం చూడొచ్చు.

"""/" / అయితే ఆ తోవ ప‌క్క‌న ఓ కోతి చేతిలో కర్ర ఉంది.

ఇక ఆ వృద్ధుడికి క‌ర్ర సాయం కావాల్సి వ‌చ్చింది.న‌డిచేందుకు క‌ర్ర‌ను తీసుకోవాల‌నుకున్నాడు.

ఇక ఆ వృద్ధుడు ఆ చేతిక‌ర్ర‌ను ఇవ్వాలంటూ దాన్ని అడుగుతాడు.కానీ కోతి ఏ మాత్రం దాడికి దిగ‌కుండా త‌న చేతిలో ఉన్న క‌ర్ర‌ను ఎంతో గౌర‌వంగా తీసుకెళ్లి మ‌ర్యాద‌గా అత‌నికి ఇవ్వ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఇదంతా కూడా వీడియోలో రికార్డు కావ‌డంతో అంద‌రూ ఆ కోతి సాయాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు.

కోతులు ఇలా కూడా ఉంటాయా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తూ ప్ర‌శంసిస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి