రాత్రిపూట అరటిపండు తొక్కను ముఖానికి రుద్దితే.. మీరు అందంగా కనిపించడాన్ని ఎవరు ఆపలేరు..!

మనం ఆహారంగా తీసుకునే పండ్లలో అరటిపండు( Banana ) ముందు వరుసలో ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

అరటి పండు మార్కెట్లో సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి.అరటిపండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్న సంగతి దాదాపు చాలా మందికి తెలుసు.

అయితే సాధారణంగా మనం అరటిపండును తినీ అరటిపండు తొక్కను( Banana Peel ) పారేస్తూ ఉంటాం.

కానీ అరటి తొక్క కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది.అరటి తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

ఇది మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.చర్మం పై ఉండే ముడతలను, మొటిమలను, మచ్చలను, గాయాల వల్ల కలిగిన మచ్చలను తొలగించడంలో అరటి తొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

తాజా అరటి తొక్క ముక్కలను చిన్నచిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి.ఒక ముక్కను తీసుకొని మన ముఖానికి రుద్దుకోవాలి.

ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల నల్లని మచ్చలు, ముడతలు వంటి సమస్యలు దూరం అవుతాయి.

"""/" / మొటిమల సమస్యలతో బాధపడేవారు అరటి తొక్కను రాత్రి పడుకునే ముందు ముఖానికి రుద్దుకొని ఉదయాన్నే కడిగేయాలి.

ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం వల్ల మొటిమల సమస్యలు దూరం అవుతుంది.

అంతేకాకుండా అరటి తొక్క తో ఒక అద్భుతమైన చిట్కాను తయారు చేసుకొని వాడడం వల్ల మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు.

"""/" / ఒక జార్ లో నాలుగు అరటి తొక్క ముక్కలను ఒక చిన్న ముక్క అరటిపండును వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలో తీసుకోవాలి.

ఆ తర్వాత ఇందులో ఒక టీస్పూన్ బియ్యం పొడి, అర టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.ఆరిన తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి.

ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గి ముఖం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.

జనాలు మెచ్చేలా వైసీపీ కొత్త మేనిఫెస్టో.. ఇక జగన్ కు తిరుగులేనట్టే ?