గంగా నదిలోకి దూకి దంపతులు ఆత్మహత్య.. వాళ్లు రాసిన లెటర్‌లో ఏముందో చదివితే..

ఈరోజుల్లో చాలామంది మంచి లైఫ్ స్టైల్ గడపాలని అప్పులు చేస్తున్నారు వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు వదిలేస్తున్నారు.

తాజాగా నార్త్ ఇండియాలో ఇలాంటి మరో విషాద ఘటన చోటుచేసుకుంది.సహారన్‌పూర్‌లోని సాయి జ్యువెలర్స్( Sai Jewelers In Saharanpu )యజమాని సౌరభ్ బబ్బర్( Saurabh Babbar ) , తన భార్య మోనాతో కలిసి హరిద్వార్‌లో గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

భారీ అప్పులు భరించలేకనే ఈ విషాద నిర్ణయం తీసుకున్నట్లు వారు ఒక సూసైడ్ లెటర్ రాసుకున్నారు.

ఈ దంపతులను చూస్తుంటే చాలా తక్కువ వయసు ఉన్నట్లుగా తెలుస్తోంది.మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు.

ఈ చూడచక్కని జంట ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

"""/" / సూసైడ్ లెటర్ చదివి చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.అప్పుల బాధ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నారు.

సౌరభ్ తన భార్య మోనాతో( Mona ) కలిసి ఆత్మహత్య చేసుకునే ముందు, వారు ఉన్న చోట ఒక సెల్ఫీ తీసుకుని తన స్నేహితులకు వాట్సాప్‌లో పంపారు.

అంటే, వారి జీవితం ఇప్పుడు ముగియబోతుందని వారు తమ స్నేహితులకు తెలియజేయడానికి ప్రయత్నించారు.

ఆ తర్వాత వారు ఇద్దరూ కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.సౌరభ్ శవాన్ని కనుగొన్నారు కానీ, మోనా శవాన్ని ఇంకా కనుగొనలేకపోయారు.

"""/" / ఆ దంపతులు రాసి వదిలిన లేఖలో, తమపై పడిన భారీ అప్పుల భారాన్ని తట్టుకోలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలిపారు.

వారి ఈ విషాదకర చర్య వల్ల వారి సమాజం మొత్తం షాక్‌కు గురైంది.

ఈ సంఘటన, ఆర్థిక ఇబ్బందులు ఎంతటి విషాదానికి దారితీస్తాయో చూపిస్తోంది.మళ్లీ ఒకసారి చర్చకు తెచ్చింది.

మోనా శవాన్ని కనుగొనడానికి అధికారులు ఇంకా ప్రయత్నిస్తున్నారు.ఈ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసుకోవడానికి విచారణ జరుగుతోంది.

వారి స్నేహితులు, బంధువులు వారి మరణానికి శోకం వ్యక్తం చేస్తున్నారు.

కాల్వలో పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.. వీడియో వైరల్