ఎమ్మార్వోను ప్రశ్నిస్తే విలేకరులపై కేసులా…?

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ కార్యాలయాల్లో( Government Offices ) జరుగుతున్న పనులపై తెలుసుకునే హక్కు కామన్ మ్యాన్ కూడా ఉంటుంది.

కానీ,జర్నలిస్టులకు కూడా అడిగే హక్కు లేదని,జర్నలిజానికే కొత్త భాష్యం చెబుతున్న మోతె ఎమ్మార్వో తీరు పలు విమర్శలకు దారితీస్తుంది.

వివరాల్లోకి వెళితే.సూర్యాపేట జిల్లా( Suryapet District ) మోతె ఎమ్మార్వో అఫీస్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై రెండు రోజుల క్రితం ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై వివరణ అడిగేందుకు బుధవారం ఎమ్మార్వో అఫీస్ కు వెళ్ళిన ఓ విలేకరిపై తహశీల్దార్ సంఘమిత్ర అక్రమ కేసులు బనాయిస్తానని బెదిరింపులకు దిగి, పోలీసులకు ఫోన్ చేసి భయబ్రాంతులకు గురి చేయడాన్ని మోతె మండల నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.

మోతె మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మార్వో అఫీస్ లో జరుగుతున్న అవినీతి,అక్రమాలపై ఓ పత్రికలో వచ్చిన కథనంపై వివరణ కోసం వెళ్లగా ఎమ్మార్వో సంఘమిత్ర సదరు విలేకరిపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి,తాన ఛాంబర్ లో నిలబెట్టి స్థానిక ఎస్సై సమక్షంలో అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు.

మీకు సమాధానం చెప్పడానికి నాకు సమయం లేదని దాబాయిస్తూ అక్రిడిటేషన్ ఉన్న విలేకరులు మాత్రమే తమ అఫీస్ లోకి రావాలని హుకుం జారీ చేశారని, మీరు విలేకరులతో నకిలీ విలేకరులో ఎవరికీ తెలుసని అవమానిస్తూ కించపరిచారని అన్నారు.

సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వర్కింగ్ జర్నలిస్టులుగా పని చేస్తున్న నాన్ అక్రిడిటేషన్ విలేకర్లను బెదిరించి, అవమానపరిచిన ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాన్ అక్రిడిటేషన్ వర్కింగ్ జర్నలిస్టులు పల్లెల లక్ష్మణ్,గట్టిగుండ్ల రాము, ఏర్పుల సాయికృష్ణ, గురిజల వెంకన్న,కొండ ఉదయ్,పల్లెల రాము, దారమల్ల ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

ఒక్క పోస్టుతో మరోసారి దొరికిపోయిన రష్మిక విజయ్ దేవరకొండ.. కలిసే ఆ పని చేశారా?