చీపురు విషయంలో ఈ చిన్న పొరపాటు చేస్తే.. మీ జీవితంలో దరిద్రమే..!
TeluguStop.com
మనదేశంలో చాలామంది ప్రజలు చీపురుని( Broom ) లక్ష్మీదేవికి ( Goddess Lakshmi )ప్రతిరూపంగా భావిస్తారు.
అదేవిధంగా వాస్తు శాస్త్రంలో చీపురుకు ప్రత్యేకత ఉంది.చిపురు ఇంట్లోని మురికి, చెత్తను తొలగించడానికి మాత్రమే ఉపయోగించే వస్తువు కాదు.
ఇంటికి పట్టిన దరిద్రాన్ని కూడా తొలగించగల శక్తి కలిగినది అని ప్రజలు భావిస్తారు.
ఇంట్లో ఉండే చీపురు విషయంలో కొన్ని నియమాలు కూడా వాస్తు శాస్త్రంలో చెబుతున్నారు.
ఆ నియమాల్ని పాటించకపోతే ఆ ఇంట్లో దరిద్రం( Home ) తాండవిస్తుందని వాస్తు నిపణులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో చీపురు ఉంచే విషయంలో సూచించబడిన నియమాల్ని పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.
ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుని ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు.
నిలబెట్టి ఉంచే చీపురు ను అ శుభం గా చాలామంది ప్రజలు భావిస్తారు.
అందుకే చీపురును ఎప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి.చీపురును ఎప్పుడు కిచెన్ లో ఉంచకూడదు.
కిచెన్ లో చీపురు ఉంచడం వల్ల ఇంట్లో అన్నం కొరతా ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అంతేకాకుండా ఇంటి కుటుంబ సభ్యులు ఆరోగ్యం పై కూడా చెడు ప్రభావం పడుతుంది.
వాసు పండితుల ప్రకారం ఇంట్లో చిపురుని డబ్బులు దాచినట్లు దాచి ఉంచాలి. """/" /
దీన్ని బహిరంగంగా ఉంచడం వల్ల అందరి దృష్టి అటే వెళ్తుంది ఇతరుల దృష్టి పడనిచోట ఇంట్లో చీపురును ఉంచాలని చెబుతున్నారు.
బహిరంగంగా ఉంచితే ఆ ఇంట్లోనీ పాజిటివ్ ఎనర్జీ నీ ఆ చీపురు దూరం చేస్తుందని చెబుతున్నారు.
వాస్తు నిపుణుల సూచన ప్రకారం చీపురు ఎప్పుడు దక్షిణ దిశలో ఉంచాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తొలగిపోయి, ఆనందం వస్తుందని చెబుతున్నారు.
"""/" /
ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇల్లు ఊడవడం లాంటి పనులు చేయకూడదు.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.చీపురును ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ లో ఉంచకూడదు.
అలా చేస్తే ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే చీపురునీ పశ్చిమం లేదా దక్షిణ దిశలోనే ఉంచడం మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే పాడైన చీపురుతో పనిచేయకూడదు.
వీడియో: ఇది భార్య లేక రాక్షసా.. భర్తను ఇంత ఘోరంగా చితక బాదిందేంటి..