నచ్చితే రియల్ నచ్చకపోతే ఫేకా ? విజయ సాయి రెడ్డి

ఎన్నికల సీజన్ కావడంతో ముందస్తు సర్వేల హడావుడి ఎక్కువైంది.ప్రజల నాడి పట్టుకొని గెలుపు పై సర్వేలు చేసే చాలా మీడియా సంస్థలకు ఒకప్పుడు అంచనాలకు దగ్గరగా ఉన్న ఫలితాలను ప్రకటించేవి.

అయితే మీడియా చానల్స్ మధ్యన కాంపిటీషన్ పెరిగిపోవడం వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం కావడంతో రకరకాల పార్టీల నుంచి ప్రయోజనాలను పొందుతూ వారికి అనుకూలమైన సర్వే ఫలితాలను ప్రకటించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది.

దాంతో ప్రకటించే ప్రతి సర్వే పైన ప్రజలు అనుమానపు చూపులతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"""/" / నిన్న నిన్న మొన్నటి వరకు టైమ్స్ నౌ మీడియా( Times Now Media ) వైసిపి కి అనుకూలంగా 25 సీట్లు వస్తాయని ప్రకటించడం ఆ సర్వేల విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం అవటం తెలిసిన విషయమే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కచ్చితంగా కనిపిస్తున్నప్పుడు 25 ఎంపీ సీట్లు సాధించడం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాంటప్పుడు 25 సీట్లు వస్తాయని ప్రకటించడం వెనక టైమ్స్ - నౌ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

అయితే ఇప్పుడు ఇండియా టుడే సర్వేలో( India Today Survey ) 15 సీట్లు తెలుగుదేశం దాని మిత్రపక్షాలు గెలుచుకుంటాయి అంటూ వచ్చిన సర్వే పట్ల తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇండియా టుడే విశ్వసనీయత కలిగినదంటూ తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. """/" / ఇప్పుడు దానిపై వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )సెటైర్లు వేశారు.

తాను చేస్తే శృంగారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా తెలుగుదేశం అనుకూలం మీడియా వ్యవహారం ఉన్నదని తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలు మాత్రమే వాస్తవమైనది వ్యతిరేకంగా వచ్చిన ఫేక్ అంటూ ప్రచారం చేయటం పచ్చ మీడియా నైజం అంటూ ఆయన ట్విటర్ వేదికగా విమర్శించారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో సర్వేల విశ్వసనీత మాత్రం ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పవచ్చు .

మరో సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ…