వైరల్: రైలు పట్టాలపై నిద్ర పోయిన వీర వనిత.. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
TeluguStop.com
ఎంత నిద్ర ముంచుకొచ్చినా, రైలు పట్టాలపై నిద్ర పోవడం ఏమిటి? బెడ్డు మీదో లేదంటే నేలపై పాడుకోవాలి గాని! అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్టే.
అసలు విషయం తెలిస్తే మీరు బిత్తరబోతారు.మరెందుకు ఆలస్యం? కథలోకి వెళ్ళిపోదాం రండి! మనలో అనేకమంది తమ దైనందిత జీవితంలో ఎన్నో రకాల అవాంతరాలు, అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు.
కొందరు వాటిని అలవోకగా ఎదుర్కొని ముందుకెళ్తుంటారు.మరికొందరికి ఆ ఓర్పు ఉండదు.
ఏది అనుకున్న వెంటనే అయిపోవాలని అనుకుంటారు.దేనికైనా సరైన సమయం రావాలి కదా.
ఈ క్రమంలోనే కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలు బలితీసుకుంటూ ఉంటారు.
"""/" /
మీరు ఆలోచిస్తున్నది నిజమే.పూర్తికధలోకి వెళితే.
బీహార్‌లోని మోతిహారిలో ( Motihari, Bihar )జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి చనిపోవాలని నిర్ణయించుకొని, ఆలోచన వచ్చిందే తడవుగా నేరుగా రైలు పట్టాల వద్దకు చేరుకుంది.
చనిపోవాలనైతే అనుకుంది గానీ ఎంత ఎదురు చూసినా రైలు పట్టాలపైకి రాలేదు.దీంతో చాలా సేపు ఎదురు చూసి, చూసి పాపం చివరికి.
నిద్ర ముంచుకొచ్చి అలా పట్టాలపైనే పడుకుని ఓ కునుకేసింది.దాంతో ఆమె గాఢ నిద్రలో ఉండగా.
ఓ రైలు అటుగా వచ్చింది.రైలులోని లోకో పైలట్ పట్టాలపై ఎవరో పడి ఉండటాన్ని గమనించి, అల్లంత దూరం ట్రైన్ ఉండగానే బ్రేక్ వేశాడు.
దాంతో రైలు సరిగ్గా వచ్చి యువతికి అరడుగు దూరంలో ఆగింది. """/" /
ఆ తరువాత రైలు దిగొచ్చి ఆయన యువతి చెయ్యి పట్టి బయటకి లాగాడు.
అప్పుడు సదరు యువతి మత్తుగా అటుఇటు తల తిప్పి చూసి అవాక్కయింది.అవును, ఎదురుగా నిలిచిపోయిన రైలు, చుట్టూ జనాన్ని చూసి బిత్తరపోయింది.
యమపురికి పోవాల్సిన నేను, ఇంకా నేలమీదే ఉన్నానేమిటి అన్నట్టు అనుమానంగా చూడగా లోకో పైలట్ ఆమెకి బుద్దులు చెప్పి, రెండు చివాట్లు వేసిమరీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు.
మోతిహారి నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్తున్న రైలు అది.సకాలంలో లోకో పైలట్ సూసైడ్‌కు ప్రయత్నించిన యువతిని గమనించి బ్రేకులు వేసి, ఆమె ప్రాణాలను కాపాడడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ లో ఆ వేదన ఉంది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!