గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ పడి ఫ్లైట్ డోర్ ఊడబీకేసిన వ్యక్తి.. తర్వాతేమైందో తెలిస్తే..?

ఇటీవల కాలంలో విమానంలో కొందరు ప్యాసింజర్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ అందరికీ భయాందోళనలు కలిగిస్తున్నారు.

తాజాగా బోస్టన్ లోగన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ( Boston Logan International Airport )లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది.

అందరూ షాక్ అయ్యేలా ఓ ప్రయాణికుడు ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్‌ను పూర్తిగా ఓపెన్ చేశాడు.

జెట్‌బ్లూ విమానం శాన్ జువాన్, ప్యూర్టోరికోకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే, ప్రయాణికుడికి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో గొడవ జరిగిందట.కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి ఒక్కసారిగా సీటు నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లి ఎమర్జెన్సీ డోర్‌ను పట్టుకుని పూర్తిగా తెరిచేశాడు.

అంతేనా, ఎమర్జెన్సీ స్లైడ్ ( Emergency Slide )కూడా వెంటనే తెరుచుకుంది.అక్కడ ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఏం జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపు బిత్తరపోయారు. """/" / అయితే, అప్రమత్తమైన ఎయిర్ మార్షల్( Air Marshal ), తోటి ప్రయాణికులు వెంటనే రంగంలోకి దిగారు.

ఆ వ్యక్తి విమానం నుంచి దూకేందుకు ప్రయత్నించకుండా అతన్ని పట్టుకుని కిందకు లాగి వేశారు.

పోలీసులు వచ్చేంత వరకు అతన్ని గట్టిగా పట్టుకుని కదలకుండా చేశారు.సమయానికి వాళ్లు స్పందించకపోతే ఏం జరిగేదో ఊహించడానికే భయంగా ఉంది.

ఈ గొడవకు అసలు కారణం వేరే ఉంది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.ఆ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చూడాలని అడిగాడట, కానీ ఆమె ఒప్పుకోలేదట.

దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసిందని తెలుస్తోంది.

మరో ప్రయాణికుడు కూడా ఈ విషయాన్నే తెలిపాడు.ఆ వ్యక్తి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినట్టు ప్రవర్తించాడని, ఊహించని విధంగా డోర్ తెరవడానికి ప్రయత్నించాడని చెప్పాడు.

ఒక వ్యక్తి అయితే ఈ సంఘటనను మరింత అతిశయోక్తిగా చెప్పాడు.అతను విమానం డోర్ ను పూర్తిగా ఊడబికేశాడు అంటూ కామెంట్లు చేశాడు.

"""/" / ఈ ఘటనపై మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు ( Massachusetts State Police )ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆ వ్యక్తి ఎలాంటి హెచ్చరిక లేకుండా విమానం తలుపు తెరిచాడని, ప్రయాణికులు అతన్ని నియంత్రించిన తర్వాత తమ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఈ సంఘటనతో విమానయాన సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.దీంతో ఆ విమానంలోని ప్రయాణికులతో పాటు, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇతర విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది.

ఈ ఘటన విమానాల్లో ప్రయాణికుల భద్రత, వారి ప్రవర్తనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

అదృష్టవశాత్తూ ఎయిర్ మార్షల్, ప్రయాణికులు వెంటనే స్పందించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీ.. అనితకు గట్టిపోటీ తప్పదా?