మొలకెత్తిన శనగల గురించి ఈ విషయాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!
TeluguStop.com
శనగలు.వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
రుచి పరంగానే కాదు శనగల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా నిండి ఉంటాయి.
అందుకే శనగలు ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంటాయి.అయితే ఆ ప్రయోజనాలు వాటిని తీసుకునే విధానంపై కూడా ఆధారపడి ఉంటాయి.
కొందరు శనగలను ఉడికించి తీసుకుంటారు.మరికొందరు కర్రీ, చారు రూపంలో తీసుకుంటారు.
ఇంకొందరు మరో విధంగా తీసుకుంటారు.అయితే శనగలను మొలకెత్తించి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.
అవును, మొలకెత్తిన శనగల్లో పోషకాలు రెట్టింపు అవుతాయి.అందువల్ల ఆరోగ్య లాభాలు అధికంగా లభిస్తాయి.
అసల గురించి తెలిస్తే మొలకెత్తిన శనగలను తినకుండా ఉండలేరు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
అయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్‌ను తగ్గించడంలో మొలకెత్తిన శనగలు అద్భుతంగా సహాయపడతాయి.
అందుకోసం వీటిని రోజూ ఉదయాన్నే ఒక కప్పు చప్పున తీసుకోవాలి.అలాగే ఎముకల బలహీనతతో బాధపడేవారికి మొలకెత్తిన శనగలు ఓ ఔషధం.
వీటిని డైట్‌లో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.మామూలు శనగల్లో కంటే మొలకెత్తిన శనగల్లో ఐరన్ అధికంగా ఉంటుంది.
అందువల్ల, మొలకెత్తిన శనగలను తరచూ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండొచ్చు. """/"/
అంతేకాదండోయ్.
మొలకెత్తిన శనగలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.హైబీపీ సమస్య నుండి విముక్తి లభిస్తుంది.
నిద్రలేమి నుండి బయటపడొచ్చు.నీరసం, అలసట వంటి వాటికి బై బై చెప్పొచ్చు.
జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.
కిరణ్ అబ్బవరం క సినిమా సక్సెస్ సాధించిందా..?