అమెరికాలో PhD వదిలేసి.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్.. ఈ చైనా వ్యక్తి కథ తెలిస్తే మైండ్ బ్లాకే..

ఉన్నత చదువులను పక్కన పెట్టి, ఓ యువకుడు స్ట్రీట్ ఫుడ్ బండి పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చైనాకు చెందిన ఆ యువకుడి సాహసోపేత నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.అతని పేరు ఫీ యూ (Fei Yu), వయసు కేవలం 24 ఏళ్లు.

చైనాలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన ఫుడాన్ యూనివర్సిటీ (Fudan University)లో మాస్టర్స్ డిగ్రీ దాదాపు పూర్తి కావస్తోంది.

సరిగ్గా అప్పుడే అతను ఓ నిర్ణయం తీసుకున్నాడు.అమెరికా వెళ్లి పీహెచ్‌డీ చేయాలన్న తన పెద్ద ప్లాన్ మొత్తాన్నీ వదులుకున్నాడు.

ఫుడాన్ యూనివర్సిటీలో చేరకముందు, ఫీ యూ సిచువాన్ యూనివర్సిటీ (Sichuan University)లో పబ్లిక్ హెల్త్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

అది కూడా మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీనే.పేద కుటుంబం నుంచి వచ్చిన అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి రక్తం ధారపోశాడనే చెప్పాలి.

"""/" / కానీ మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో మొదటి సెమిస్టర్‌లోనే అతనికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

తన మెంటార్ వేధింపుల వల్ల అతను తీవ్రమైన డిప్రెషన్, నిద్రలేమి, కడుపు నొప్పితో బాధపడ్డాడు.

దీంతో కోలుకోవడానికి ఏడాది పాటు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.ఆపై అమెరికాలో పీహెచ్‌డీ కోసం ప్రయత్నించాడు.

ఓ ప్రముఖ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో సీటు కూడా దొరికింది.అన్నీ బాగున్నాయి అనుకునే లోపే, అమెరికా-చైనా మధ్య సంబంధాలు దెబ్బతినడం, నిధుల కోతలు వంటి కారణాల వల్ల అతని స్కాలర్‌షిప్ రద్దయింది.

ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబం కావడంతో, చదువును కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది.

ఇక లాభం లేదనుకున్నాడు.వేరే దారి చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

చిన్నప్పుడు అమ్మమ్మతో కలిసి బెలూన్లు అమ్మిన రోజులు గుర్తుకొచ్చాయి.అదే స్ఫూర్తితో ఓ స్ట్రీట్ ఫుడ్ బండి పెట్టాలని ఆలోచించాడు.

అనుకున్నదే తడవుగా ఈ ఏడాది మార్చిలో, తన పాత యూనివర్సిటీ సిచువాన్ యూనివర్సిటీ గేటు పక్కనే ఓ చిన్న మ్యాష్డ్ పొటాటో స్టాల్ పెట్టేశాడు.

"""/" / "అంత మంచి చదువు వదిలి ఇలా బండి పెట్టుకోవడం ఏంటి?" అని చాలా మంది అతన్ని విమర్శించారు.

దీనిపై ఫీ యూ స్పందిస్తూ, "ఇది దురదృష్టకరం అని నేను అస్సలు అనుకోవడం లేదు.

చివరి ఫలితం ఏంటి అన్నది ముఖ్యం కాదు, ఆ ప్రయాణమే, ఆ అనుభవమే నాకు ముఖ్యం" అని చెప్పాడు.

ఆ స్టాల్ పెట్టిన కొద్ది రోజులకే బాగా పాపులర్ అయ్యింది.ఫీ యూ మ్యాష్డ్ పొటాటో తినడానికి కస్టమర్లు ఎగబడుతున్నారు, పెద్ద క్యూలే కడుతున్నారు.

ప్రస్తుతం అతను రోజూ రూ.8,200 నుంచి రూ.

11,700 వరకు సంపాదిస్తున్నాడు."ఇంత చదువు చదివి ఇలాంటి పని చేస్తున్నందుకు ఏమైనా సిగ్గు పడుతున్నారా?" అని అడిగితే, "నేను అస్సలు సిగ్గుపడటం లేదు.

నేను అందరితో కలివిడిగా, సరదాగా ఉండే మనిషిని.నా స్టోరీ నలుగురికీ తెలియడం, నా గురించి తెలుసుకోవాలని వాళ్లు ఆసక్తి చూపడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది.

నా ఫుడ్ నచ్చితే కచ్చితంగా మళ్లీ వస్తారు కదా" అని నవ్వుతూ చెప్పాడు ఫీ యూ.