వామ్మో, మెటావర్స్‌లో వర్చువల్ ప్లాట్ ధర తెలిస్తే.. షాకే!

వాస్తవ ప్రపంచానికి చాలా దగ్గరగా ఉండే వర్చువల్‌ ప్రపంచాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

మెటావర్స్‌ అనే కొత్త టెక్నాలజీ ప్రతి ఒక్కరికి చేరువ చేసి ఇంటర్నెట్లో మరో శకానికి నాంది పలకడానికి ఫేస్‌బుక్ పూనుకుంది.

అయితే వాస్తవ ప్రపంచం లాగానే ఉండే ఈ మెటావర్స్‌లో కూడా ప్లాట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే మెటావర్స్‌లో ప్లాట్ల విక్రయాలు మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో కెనడాకు చెందిన ఓ సంస్థ 2.

5 మిలియన్‌ డాలర్లను వెచ్చించి ఓ వర్చువల్‌ ప్లాట్‌ను సొంతం చేసుకుంది.అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.

19 కోట్ల అన్నమాట.భౌతికంగా మనం పట్టుకోలేని ఒక వర్చువల్‌ ప్లాట్‌ ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.

సదరు కెనడా సంస్థ క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు చెల్లించి ఈ వర్చువల్ ఫ్లాట్ కొనుగోలు చేసింది.

టెక్ నిపుణుల ప్రకారం ఇప్పటివరకూ మెటావర్స్‌లో జరిగిన అతిపెద్ద కొనుగోలు ఇదేనట.మరి మున్ముందు ఏ రేంజ్ లో ప్లాట్లు అమ్ముడుపోతాయో చూడాలి.

"""/"/ వివరాల్లోకి వెళితే.డిసెంట్రలైజ్‌డ్‌ ఫినాన్స్‌ సర్వీసులు అందించే టోకెన్‌.

కామ్‌ అనే కెనడా సంస్థ డిసెంట్రల్యాండ్‌ అనే కంపెనీ నుంచి ఈ వర్చువల్‌ ఫ్లాట్‌ను కొనుక్కుంది.

డిసెంట్రాల్యాండ్‌ కంపెనీ మెటావర్స్‌ టెక్నాలజీ సాయంతో క్రిప్టోకరెన్సీలను యూజ్ చేసి వర్చువల్‌ ప్లాట్లు విక్రయిస్తోంది.

ఈ వర్చువల్‌ ప్లాట్లలో మెటావర్స్‌ టెక్నాలజీతో ఫ్యాషన్‌ షోలు కండక్ట్ చేయవచ్చు.ఇంకా మరెన్నో పనులు చేసుకోవచ్చు.

కొత్త మెటావర్స్‌ బిజినెస్ ఎప్పుడు లాభాల బాట పడుతుందో కచ్చితంగా చెప్పలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వచ్చే దశాబ్దకాలంలో మెటావర్స్‌ సేవలు 100 కోట్ల మందికి అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

డిజిటల్ కరెన్సీ వందల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని.వర్చువల్ వరల్డ్ తో క్రియేటర్లు, డెవలపర్ల రూపంలో లక్షల్లో ఉద్యోగాలను సృష్టించవచ్చని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఓజీ హైలెట్ అయ్యే సీన్ ఏంటో తెలిసిపోయింది…