ఆత్రేయపురం బంగారు పూతరేకుల ఖరీదు తెలిస్తే మీకు హైబీపీ వచ్చేస్తుంది!

మనందరికీ ఆత్రేయపురం( Atreyapuram ) అనే పేరు వినగానే వెంటనే గుర్తెచ్చేవి పూతరేకులు( Putarekulu ).

అవును, పూతరేకులకు పెట్టింది పేరు ఆత్రేయపురం.ఇక్కడినుండి విదేశాలకు కూడా ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయంటే వాటి మహిమ గురించి ఇంకా చెప్పేదేముంది? దేశంలో చాలామంది బడాబాబులు పెళ్లిళ్లు, పబ్బాలప్పుడు వీటినే తమ అతిధులకు వడ్డిస్తారు.

ఈ పూత రేకులు అంటే ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న స్వీట్ లవర్స్ ఇష్టపడతారు.

రంగు, రుచి, సువాసన, శుభ్రత వల్ల వీటికి అంత క్రేజ్ వచ్చింది అని చెప్పుకోవచ్చు.

"""/" / అయితే తాజాగా ఇక్కడ బంగారు పూతరేకులు తయారు ( Gold Plated Putharekulu )చేశారు.

అక్షయ తృతీయ నేపథ్యంలో ఈ పూతరేకులు చేయడం జరిగింది.ఎడిబుల్ గోల్డ్( Edible Gold ) అనగా స్వీట్స్ తయారీలో వినియోగించే స్వర్ణ రేకులతో ఈ పూతరేకులు తయారు చేసారని వినికిడి.

ఇక్కడ ఒక్కో బంగారు పూత రేకు ధర 800 రూపాయలు.ఆత్రేయపురం చాదస్తం పూతరేకుల షాపులో 24 క్యారెట్స్ ఎడిబుల్ గోల్డ్‌తో తయారు చేసిన పూతరేకులను స్పెషల్‌గా విక్రయించడం జరిగింది.

ఈ పూతరేకులను టేస్ట్ చేసేందుకు జనం కూడా ఆసక్తి కనబరిచారు. """/" / అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనుగోలుకు ప్రసిద్ధి.

ఈ సందర్భంగానే గోల్డెన్ పూత రేకులు తయారు చేసినట్లు షాపు యజమాని తెలిపారు.

ఆత్రేయపురం పూతరేకులకు ఇటీవలే అంతర్జాతీయ భౌగోలిక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే.ఏపీకి సంబందించి ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం ఉన్న ఇలాంటి వాటికి భౌగోళిక గుర్తింపు దక్కడం విశేషం అని చెప్పుకోవాలి.

తిరుపతి లడ్డూ, బందరు లడ్డూ, కొండపల్లి బొమ్మలు, ఉప్పాడ జిందానీ చీరలు ఈ లిస్టులో ఉండగా తాజాగా ఆత్రేయపురం పూతరేకు ఈ లిస్ట్‌లో చేరింది.

మరో 4 నెలల్లో దీనికి సంబంధిచిన గెజిట్‌ రానున్నట్లు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఇటీవల తెలిపారు.

బ‌రువు త‌గ్గాల‌ని భావించేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!