చైనా స్నేహితుడిని కలిసేందుకు అమెరికన్ యువతి వినూత్న ప్రయత్నం.. అప్పుడేం జరిగిందో తెలిస్తే..?

సాధారణంగా మనం చిరకాల స్నేహితుడు నుంచి విడిపోతుంటాం.కొన్నేళ్లు తరబడి మనకీ, స్నేహితుల మధ్య గ్యాప్ వచ్చేస్తుంది.

మళ్లీ కలవాలని ప్రయత్నించినా స్నేహితుడి ఆచూకీ దొరకదు అలాంటప్పుడు చాలా బాధేస్తుంది.అయితే ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ఏడేళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మళ్లీ కలిశారు.

ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ అద్భుతం చైనా యాప్( China App ) ద్వారా జరిగింది.

21 ఏళ్ల సెలియా అనే అమెరికన్‌ అమ్మాయి తన చిన్ననాటి స్నేహితుడు సైమన్‌ను వెతికేందుకు రెడ్‌నోట్ అనే చైనా యాప్‌ను ఆశ్రయించింది.

టిక్‌టాక్‌లాంటి ఈ యాప్ ద్వారా ఆమె తన పాత స్నేహితుడిని వెతికింది.2017-2018 కాలంలో సెలియా అమెరికాలోని అయోవాలో ( Celia In Iowa, USA )ఒక ప్రైవేట్ కాథలిక్ స్కూల్‌లో చదువుకుంది.

అప్పుడే సైమన్ అనే చైనీస్ ఎక్స్ఛేంజ్ స్టూడెంట్‌తో ఆమెకు స్నేహం కుదిరింది.ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.

కానీ, సైమన్ చైనా తిరిగి వెళ్లిపోవడంతో వీళ్లిద్దరూ టచ్‌లో లేకుండా పోయారు.ఏడేళ్లు గడిచిపోయాయి.

అయినా సెలియా తన స్నేహితుడిని మర్చిపోలేకపోయింది.ఇంతలో సెలియాకు ఒక ఐడియా వచ్చింది.

చైనాలో బాగా పాపులరైన రెడ్‌నోట్ యాప్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది."రెడ్‌నోట్ యూజర్లారా, నాకో హెల్ప్ చేయాలి.

నా పాత స్నేహితుడు సైమన్‌ను వెతకడానికి మీరంతా నాకు సాయం చేయాలి" అని ఎమోషనల్ వీడియోలో అడిగింది.

అంతేకాదు, "సైమన్, నిన్ను నేను చాలా మిస్ అవుతున్నా." అంటూ హార్ట్ టచింగ్ మెసేజ్ కూడా చెప్పింది.

"""/" / సెలియా వీడియో పోస్ట్ చేసిందో లేదో, చైనీస్ రెడ్‌నోట్ కమ్యూనిటీ ( Chinese Rednote Community )వెంటనే రెస్పాండ్ అయింది.

ఆమె సైమన్ పాత ఫొటోను షేర్ చేయగానే, ఎవరో అతన్ని గుర్తుపట్టారు.వెంటనే సైమన్‌కు ఆ విషయం చేరవేశారు.

కొన్ని గంటల్లోనే సెలియా వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది."ఆ వీడియోలో ఉన్నది సైమనే" అని ఎవరో కామెంట్ పెట్టారు.

"""/" / ఆ కామెంట్ చూసి సైమన్ కూడా ఆన్‌లైన్‌లో స్పందించాడు."హలో, నేను సైమన్‌ని.

ఇన్నేళ్ల తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్‌ను ఇలా కలుస్తానని కలలో కూడా అనుకోలేదు.

రెడ్‌నోట్‌కు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్" అంటూ రిప్లై ఇచ్చాడు.

ఆ తర్వాత సైమన్ ఇంకో వీడియో కూడా పోస్ట్ చేశాడు.రెడ్‌నోట్ కమ్యూనిటీ చూపించిన ప్రేమకు, సపోర్ట్‌కు సెలియా, తను ఇద్దరూ చాలా థాంక్స్‌ చెప్పాడు.

"మేమిలా కలుస్తామని కలలో కూడా అనుకోలేదు.నిజంగా గ్రేట్‌ఫుల్‌గా ఉంది" అన్నాడు సైమన్.

టిక్‌టాక్‌ను అమెరికాలో బ్యాన్ చేశాక, రెడ్‌నోట్ యాప్ యూఎస్ యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్ అయింది.

ఈ యాప్ ఇప్పుడు దేశాల మధ్య బ్రిడ్జ్‌లా పనిచేస్తోంది.సోషల్ మీడియా ఉంటే దూరమైన వాళ్లు కూడా ఒక్కటవుతారని ఈ కథతో మరోసారి ప్రూవ్ అయింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి చాలా బాధపడ్డాను… నటుడు షాకింగ్ కామెంట్స్!