విదేశీ ప్రయాణాల కోసం ఇండియన్స్ ఎంత ఖర్చు పెట్టారు తెలిస్తే!!
TeluguStop.com
విదేశీ ప్రయాణాలు చేయడం ఎప్పుడూ ఖర్చుతో కూడుకున్న పనే అని చెప్పొచ్చు.ఖర్చుతో పాటు విదేశాలకు వెళ్లాలంటే చాలా ప్రాసెస్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా వీసా, పాస్‌పోర్టు పొందాల్సి ఉంటుంది.ధనవంతులైతే పర్లేదు కానీ మధ్యతరగతి, పేద ప్రజలు ఒక్క విదేశీ ట్రిప్ కోసం కనీసం సంవత్సరం పాటు డబ్బులు దాచుకోవాల్సి ఉంటుంది.
ఇక ప్రయాణాల్లో అవుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు చాలామంది లో-కాస్ట్ ఉన్నవాటికెళ్లే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
"""/"/
అయితే ఇటీవల ఒక నివేదిక మాత్రం దీనికి భిన్నంగా కొన్ని విషయాలను వెల్లడించింది.
నివేదిక ప్రకారం, ఇటీవల భారతీయుల ఆలోచనలలో తీవ్ర మార్పులు వస్తున్నాయి.అందుకే వారి విదేశీ ప్రయాణాల కోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారట.
ఆ రిపోర్ట్ ప్రకారం, 2022-23లో మొదటి తొమ్మిది నెలల్లో విదేశీ ప్రయాణాలపై ఇండియన్స్ ఏకంగా రూ.
9 వేల కోట్లు ఖర్చు చేశారు.ఆర్‌బీఐ నుంచి వచ్చిన ఈ రిపోర్టు 2020 ఆర్థిక సంవత్సరంలో కరోనాకు ముందు ఏ ఏడాదిలో కూడా ఇండియన్స్ ఈ రేంజ్ లో ఖర్చు చేయలేదని తెలిపింది.
"""/"/
విదేశీ పర్యటనలపై ఇండియన్స్ 2022, డిసెంబర్ ఒక్క నెలలోనే 1137 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని ఆర్‌బీఐ వెల్లడించింది.
2022లో ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాలంలో భారత విదేశీ ప్రయాణికుల ఖర్చు 9,947 మిలియన్ డాలర్లుగా ఉందని రిపోర్టు వివరించింది.
అయితే విదేశీ ప్రయాణాలలో విద్య కోసం చేసేవే ఎక్కువగా ఉంటున్నాయట.ఇక ఇండియాలో ఉండే బంధువులు విదేశాల్లో నివసించే వారి కోసం భారీ ఎత్తున డబ్బులు పంపిస్తున్నారు.
మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!