హిట్లర్ వాడిన పెన్సిల్ ఎంత ధరకు అమ్ముడైందో తెలిస్తే గుండె ఆగుతుంది!
TeluguStop.com
అడాల్ఫ్ హిట్లర్( Adolf Hitler ) గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
ఆస్ట్రియాలో జన్మించిన హిట్లర్ జర్మన్ నియంతగా ఎలా ఎదిగాడన్నదీ ఇప్పటి ఒక చరిత్రే.
1933 నుండి జర్మనీ( Germany ) ఛాన్స్ లర్ గా మొదలైన ఆయన ప్రస్థానం ఆయన మరణించే వరకు జర్మనీ నియంతగానే పేరుగాంచారు.
ఇతడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీని స్థాపించడం జరిగింది.దీనినే నాజీ పార్టీ అంటారు అని కూడా అంటారు.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ ఆర్థికంగాను, సైనిక పరంగాను భారీగా నష్టపోయింది.
హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడు. """/" /
ఇక ఆ యుద్ధం తరువాత జర్మనీపై మిత్ర రాజ్యాలు అనగా యునైటెడ్ కింగ్ డం, ఫ్రాన్సు, అమెరికా, వగైరా దేశాలు విధించిన ఆంక్షలు హిట్లర్ లోని అతివాదిని నిద్రలేపాయి.
ఈ విపత్కర పరిస్థితులను హిట్లర్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.అణగారిన మధ్య తరగతి ప్రజలను హిట్లర్ తన వాక్పటిమతో ఉత్తేజితులను చేసాడు.
జర్మనీ పతనానికి యూదులే ముఖ్య కారణమని హిట్లర్ బోధించి, అతని ఉపన్యాసాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సామ్యవాద (సోషలిస్ట్) వ్యతిరేకత ఉండేట్టు జనాలను ఉత్తేజితుల్ని చేసాడు.
ఇదే ధోరణితో ఇతడు ఆస్ట్రియా, పోలండ్, చెక్ రిపబ్లిక్( Austria, Poland, Czech Republic ) లపై దండెత్తాడు.
ఇదే 2వ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది.తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.
"""/" /
ఇక అసలు విషయంలోకి వెళితే, అడాల్ఫ్ హిట్లర్కు చెందిన ఓ పెన్సిల్ తాజాగా ఓ వేలంలో అక్షరాలా రూ.
5.5 లక్షలకు అమ్ముడుపోయింది.
అంతకుముందు ఈ పెన్సిల్ రూ.50 లక్షలకు అమ్ముడవుతుందని భావించారు.
కానీ, అంచనా వేసిన విలువలో పదో వంతు మాత్రమే దానికి దక్కింది.పురాతన వస్తువులను వేలం వేసే బ్లూమ్ ఫీల్డ్ సంస్థ బెల్ఫాస్ట్లో మంగళవారం ఈ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇకపోతే 1941 ఏప్రిల్ 20న హిట్లర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లవర్ ఇవా బ్రౌన్ ఈ పెన్సిల్ను గిఫ్ట్ గా ఇచ్చింది.
దానిపై 'ఏహెచ్' (అడాల్ఫ్ హిట్లర్) అని చెక్కి ఉండడం విశేషం.
మలయాళం హీరోల బాటలో నడుస్తున్న తెలుగు సీనియర్ హీరోలు…