ఇంట్లో తులసి చుట్టూ.. ఇవి ఉంచితే మాత్రం కష్టాలు తప్పవు..!
TeluguStop.com
హిందూ సనాతన ధర్మం, వాస్తు శాస్త్రంలో తులసి( Basil) చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు.
ఇంట్లో తులసిని నటడడం ఎంతో అదృష్టమని చాలామంది ప్రజలు భావిస్తారు.శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి( Goddess Lakshmi , Lord Vishnu ) స్వయంగా తులసి పూజతో సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు.
తులసిని సంరక్షించే ఇళ్లలో తులసి వాసన వెదజల్లుతూ ఉంటుంది.అంతేకాకుండా తులసి పెంపకం తో పాటు మొక్కకు సంబంధించిన కొన్ని విషయాలతో జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. """/" /
తులసి మొక్క గురించి గుర్తుంచుకోవాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తులసిని ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి.
తులసి మొక్కను తప్పుడు దిశలో నాటడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల భౌతికంగా, ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.సహజంగానే గృహిణులు తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టుతో తులసి చెట్టుకు నీటిని సమర్పిస్తూ ఉంటారు.
ఇలా అసలు చేయకూడదు.అటువంటి పరిస్థితులలో వెంట్రుకలను ఆరబెట్టిన తర్వాత మాత్రమే తులసికి నీరు సమర్పించడం మంచిది.
"""/" /
తులసి మొక్క చుట్టూ వేరే పదార్థాలు, చెప్పులు, చీపుర్లు లేదా చెత్తను అసలు ఉంచకూడదు.
గేటు బయట అందరూ రాకపోకలు చేసే దగ్గర తులసి మొక్క నాటకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది.
అంతే కాకుండా తులసి మొక్క పై మురికి నీరు పడకుండా చూసుకోవాలి.తులసి మొక్క నాటిన కుండీలో వేరే మొక్కను అసలు నాటకూడదు.
తులసి చుట్టూ ముళ్ళ చెట్లను అసలు ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల ఇంట్లో అనర్ధాలు పెరిగి తులసి పూజ చేసిన సరైన ఫలితం లభించదు.
పాలలో నీళ్లు కలిపి తులసికి నైవేద్యంగా సమర్పించాలి.ఇలా చేయడం వల్ల తులసి పచ్చగా ఉంటుంది.
తులసీ మొక్క వేగంగా పెరుగుతుంది.ఆదివారం రోజు తులసికి నీరు సమర్పించకూడదు.
ప్రతి రోజు సాయంత్రం తులసి కింద దీపం వెలిగించాలి.
నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. ఇలా చేశారంటే దెబ్బకు పరార్!