చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతున్నారా? అయితే ఈ స్మూతీ మీకోసమే!
TeluguStop.com
సాధారణంగా కొందరు చిన్న చిన్న పనులకు కూడా తీవ్రంగా అలసిపోతుంటారు.రక్తహీనత, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, డిప్రెషన్, పోషకాల కొరత, కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి తదితర కారణాల వల్ల ఇలా జరుగుతుంటుంది.
అయితే తరచూ అలసిపోవడం వల్ల ఎంతో అసౌకర్యానికి గురవ్వాల్సి ఉంటుంది.పనిపై ఏకాగ్రత దెబ్బ తింటుంది.
అలాగే మరెన్నో సమస్యలు సైతం చుట్టుముడతాయి.అందుకే అలసటకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
ఈ స్మూతీని డైట్ లో కనుక చేర్చుకుంటే అలసట అన్న మాట అనరు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
"""/"/
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆల్మండ్ బటర్, నాలుగు వాల్ నట్స్, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఒక గ్లాస్ సోయా పాలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్దమవుతుంది.
""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2023/02/fatigue-smoothie-healthy-smoothie-latest-news!--jpg/
ఈ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.
వారంలో మూడు సార్లు ఈ స్మూతీని కనుక తీసుకుంటే ప్రోటీన్ తో సహా శరీరానికి అవసరమయ్యే ముఖ్య పోషకాలు లభిస్తాయి.
అలాగే ఈ స్మూతీ రక్తహీనతను తరిమి కొడుతుంది.హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.
అలసట దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే అలసటకు ఆమడ దూరంలో ఉంటారు.
మరియు నిత్యం ఫుల్ ఎనర్జిటిక్ గా పని చేస్తారు.కాబట్టి చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతున్న వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.
మూవీ ఆఫర్లు ఇస్తామని చెప్పి అలా ప్రవర్తించారు.. నిధి సంచలన వ్యాఖ్యలు వైరల్!