అయ్యో పాపం.. గుండె ఆప‌రేష‌న్ కోసం డ‌బ్బులు దాస్తే చివ‌ర‌కు..

విధి ఆడే ఆట‌కు ఎవ్వ‌ర‌మైనా బ‌ల‌వ్వాల్సిందేనేమో అనిపిస్తుంది కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే.చాలా సార్లు పేద వారినే విధి ఆడుకోవ‌డం చూస్తుంటే గుండె త‌రుక్కు పోతుంది.

మొన్న‌టికి మొన్న ఓ రైతు కొత్త ఇంటిని క‌ట్టుకునేందుకు ఉన్న పొలం అమ్మి గుడిసెలో పెట్టుకుంటే మంట‌లు చెల‌రేగి మొత్తం డ‌బ్బులు కాలిపోయిన విష‌యం ఎంత‌లా బాధించిందో చూశాం.

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అంద‌రినీ కంట త‌డి పెట్టిస్తోంది.దీని గురించి తెలిసిన త‌ర్వాత విధి ఎంత క‌ఠిన‌మైన‌దో అనిపిస్తుంది.

ఎందుకంటే క‌ష్టాల్లో ఉన్న వారినే స‌మ‌స్య‌లు వెంటాడుతాయంటే ఇదేనేమో అనిపిస్తుంది.ఈ న్యూస్ ఓ పేద వృద్ధుడికి సంబంధించింది.

రెక్కాడితే గానీ డొక్కాడని ప‌రిస్థితి ఆ ముస‌లాయ‌న‌ది.నెల్లూరు జిల్లా వాకాటికి చెందిన షేక్ మహబూబ్ బాషా ఇంత దారుణ‌మైన స్థితిలో ఉన్న స‌మ‌యంలో గుండె సమస్య వ‌చ్చి ప‌డింది.

ఎప్ప‌టి నుంచో ఆయ‌న ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.దీంతో రెక్క‌లు ముక్క‌లు చేసుకుని మ‌రీ సంపాదిస్తూ ఒక్కో రూపాయిని కూడ‌బెట్టాడు.

కానీ అనూహ్యంగా జ‌రిగిన ఘ‌ట‌న అత‌ని గుండె ప‌గిలేలా చేసింది.బీరువాలో దాచిన ల‌క్ష‌ల డ‌బ్బులు మొత్తం చెదలు ప‌ట్టేసింది.

దీంతో తీవ్రంగా వేద‌న‌కు గుర‌య్యాడు. """/"/ తాను ఎంతో క‌స్ట‌ప‌డి సంపాదించుకున్నాన‌ని, గేదెల‌ను కూడా అమ్మి మ‌రీ ఆ డ‌బ్బుల‌ను స‌మ‌కూర్చుకున్నాన‌ని బాధ ప‌డ్డాడు.

చెదలు ప‌ట్టి నోట్ల‌న్నీ చిరిగిపోవ‌డంతో వాట‌ని చూస్తూ క‌న్నీరు మున్నీర‌య్యాడు.తాను పైసా పైసా కూడ‌బెట్టుకుంట దేవుడికి మాత్రం క‌నిక‌రం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

త‌న‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాల‌ని వేడుకున్నాడు.అయితే ఇలా చెద‌లు ప‌ట్ట‌డం కొత్తేమీ కాదు.

గ‌తంలో కూడా ఇలాగే చాలామంది డబ్బుల‌ను బీరువాలో పెట్ట‌గా అవి చెద‌ల పాలువుతున్నాయి.

ఇప్పుడు పాషా పర‌స్థితి కూడా ఇలాగే ఉంది.

ఒంటరైన నిహారిక… మెగా సపోర్ట్ దొరకలేదా.. ఇదే కారణమా?