అధికారుల తీరుతో విసిగిపోయిన పెద్దాయ‌న ఏం అన్నారో వింటే..

కొన్ని సార్లు గ‌వ‌ర్న‌మెంట్ అధికారుల తీరు చూస్తే ఎవ‌రికైనా ఇదేం తీరు అనిపించ‌క మాన‌దేమో.

అప్పుడ‌ప్పుడు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన వారు కూడా ఉంటారు.

అయినా స‌రే తమ‌కు ఒక్క ప‌ని కూడా కావ‌ట్లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటారు.

ఇప్పుడు కూడా ఇలాంటి అధికారుల వ‌ల్ల విసిగిపోయిన ఓ పెద్దాయ‌న షాకింగ్ కామెంట్లు చేసేశాడు.

నా పెండ్లాన్ని నాకే ఇచ్చి మ‌ళ్లీ పెండ్లి చేస్తారా అంటూ మండిప‌డ్డాడు.దీంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

అదేంటో ఇప్పుడు చూద్దాం.ఏపీ ప్ర‌భుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమును స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

అయితే ఇందులో భాగంగా ఆఫీస‌ర్లు పెడుతున్న షరతులు.ప్రచారం అంద‌రికీ తలనొప్పిగా మారింది.

దీంతో అంద‌రూ దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.ఇక ఆఫీస‌ర్లు మాత్రం త‌మ సొంత స్థలంలో ఇల్లు క‌ట్టుకుని రిజిస్ట్రేష‌న్ కూడా చేసుకున్న ఇండ్ల వ‌ద్ద‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ  రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలంటూ చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో తీసుకున్న గృహ రుణాల‌ను ఇప్పుడు చెల్లించాలంటూ అడుగుతున్నారు. """/" / 1983 వ సంవ‌త్స‌రం నుంచి 2011 సంవ‌త్సరం వ‌ర‌కు ఇండ్లు క‌ట్టుకున్న వారిలో ఎవ‌రైతే అనుమ‌తి లేకుండా క‌ట్టుకున్నారో వారు అనుమ‌తి పొందాల‌ని ఆఫీస‌ర్లు తిరుగుతున్నారు.

ఇందులో భాగంగా ఓ పెద్దాయ‌న ఇంటికి వెళ్లి ఇదే విష‌యాన్ని ఆఫీస‌ర్లు ప్ర‌స్తావించారు.

అయితే తాను గ‌తంలోనే సొంత స్థలంలో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాన‌ని, ఇప్పుడు మ‌ళ్లీ రిజిస్ట్రేష‌న్ అంటే త‌న పెండ్లాన్ని త‌న‌కే ఇచ్చి మ‌ళ్లీ పెండ్లి చేయ‌డ‌మే అవుతుందంటూ వ్యంగ్యంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దీన్ని చూసిన వారంతా సూప‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

చరిత్రలో తొలిసారి.. కెనడా బడ్జెట్ రూపకల్పనలో హిందూ సమాజానికి చోటు