డైట్‌లో ఈ స్మూతీ ఉంటే అధిక బ‌రువు నుంచి ర‌క్త‌హీన‌త వ‌ర‌కు ఎన్నిటికో చెక్ పెట్టొచ్చు!

సాధారణంగా కొన్ని కొన్ని స్మూతీలు రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంటాయి.

అటువంటి స్మూతీలలో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే అధిక బరువు నుంచి రక్తహీనత వరకు ఎన్నో సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న సైజు బీట్ రూట్ ను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి లోప‌ల ఉండే గింజలను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

ఇక రెండు కప్పుల పుచ్చకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో దానిమ్మ గింజలు, క‌ట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ఎనిమిది నుంచి ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

అంతే మన బీట్ రూట్ వాటర్ మిలన్ స్మూతీ సిద్ధం అవుతుంది. """/" /ఈ స్మూతీ టేస్ట్ గా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఈ స్మూతీని డైట్ లో కనుక చేర్చుకుంటే మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.అతి ఆక‌లి దూరం అవుతుంది.

దాంతో వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఈ బీట్ రూట్ వాటర్ మిలన్ స్మూతీని తీసుకోవ‌డం వ‌ల్ల రక్తహీనత సమస్య ఉంటే దూరం అవుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.

మరియు ఇమ్యూనిటీ సిస్టం సైతం స్ట్రాంగ్ గా మారుతుంది.ఇన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది కాబ‌ట్టి.

త‌ప్ప‌కుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.

పవన్ చదువును మధ్యలో ఆపేయడానికి అసలు కారణమిదా.. అసలేమైందంటే?