ఈ ల‌క్ష‌ణాలు ఉంటే.. మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్టే?

మాన‌వ శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) ఒక‌టి.శ‌రీరంలో మ‌లినాలాను, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు పంప‌డంలోనూ.

తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంలోనూ.శరీరానికి కావల్సిన శక్తిని తయారు చేయ‌డంలోనూ లివ‌ర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అయితే ఏక కాలంలో అనేక పనులు చేసే ఈ లివ‌ర్ దెబ్బ తింటే ప్రాణాల‌కే ముప్పుగా మారుతుంది.

పైగా లివ‌ర్ ఆరోగ్యం పాడైంద‌ని గుర్తించ‌డం కూడా చాలా క‌ష్టం.ఎందుకంటే, దాదాపు తొంబై శాతం లివ‌ర్ దెబ్బతిన్నప్పటికీ ఒక పట్టాన లక్షణాలు బయటకు కనిపించవు.

అయితే కొన్ని కొన్ని ల‌క్ష‌ణాల బ‌ట్టీ లివ‌ర్ డ్యామేజ్‌ను గుర్తించవ‌చ్చు.మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

లివ‌ర్ దెబ్బ తిన్న‌ప్పుడు యూరిన్ ముదురు ఊదా రంగులోకి మారుతుంది.ఒక‌టి లేదా రెండు రోజులు ఇలా జ‌రిగితే ప‌ర్వాలేదు.

కానీ, రెగ్యుల‌ర్‌గా ఇదే కంటిన్యూ అయితే ఖ‌చ్చితంగా వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి వ‌స్తుంది.అలాగే ఎన్ని వ్యాయాలు చేసినా.

డైటింగ్ చేస్తున్నా బ‌రువు పెరుగుతున్నా లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్టు భావించాలి. """/" / ఎందుకంటే, లివ‌ర్ ఆరోగ్యం దెబ‌బ‌తిన్న‌ప్పుడు కూడా బ‌రువు పెరుగుతాయి.

ఇక లివ‌ర్‌లో మ‌లినాలు, టాక్సిన్లు ఎక్కువ‌గా పేరుకుపోతే.అప్పుడు శ‌రీరానికి సరైన పోషకాలను పంపలేదు.

దాంతో మీరు త‌ర‌చూ అల‌సిపోతుంటారు.చిన్న చిన్న ప‌నులు కూడా చేయ‌లేక‌పోతుంటారు.

ఇలా జ‌రిగినా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.ఇక కాలేయం సరిగా పనిచేయకుంటే.

వికారంగా ఉండ‌టం, వాంతులు అవ్వ‌డం జ‌రుగుతుంది.తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవ్వ‌దు.

ఇలా త‌ర‌చూ జ‌రుగుతుంటే.త‌గిన జాగ్ర‌త్తులు తీసుకోవాలి.

అలాగే లివ‌ర్ దెబ్బతిన‌ప్పుడు.కుడి వైపు ప్రాంతంలో నొప్పిగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.

ఇలాంటి నొప్పి ఉంటే.మీ కాలేయం డేంజ‌ర్‌లో ఉందని భావించి వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

ఒంట్లో కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!