మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే..ఖ‌చ్చితంగా చేప‌లు తినాల్సిందే!

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా ఇష్ట‌ప‌డి తినే నాన్ వెజ్ ఐటెమ్స్‌లో చేప‌లు ముందుంటాయి.

జ‌ల‌చ‌ర జంతువులైన చేప‌లు మంచి రుచి క‌లిగి ఉండ‌ట‌మే కాదు.విటిమిన్ బి, విట‌మిన్ ఇ, విట‌మిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, జింక్‌, పొటాషియం, ఐర‌న్‌, ప్రోటీన్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇలా ఎన్నో పోష‌క‌ విలువ‌లు దాగి ఉంటాయి.

అందుకే చేప‌లు అనేక జ‌బ్బుల‌ను నివారించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే స‌మ‌స్య‌లు ఉంటే.

వారు ఖ‌చ్చితంగా చెప‌లు తినాల్సి ఉంటుంది.ఈ మ‌ధ్య కాలంలో చిన్న వ‌య‌సు వారు సైతం కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

అయితే అలాంటి వారు వారానికి రెండు సార్లు త‌ప్ప‌కుండా చేప‌లు తీసుకోవాలి.త‌ద్వారా చేప‌ల్లో ఉండే ప‌లు పోష‌కాలు.

ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తాయి.దాంతో కీళ్ల నొప్పులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అలాగే ఇటీవ‌ల ప్రోటీన్ కొర‌త స‌మ‌స్య ఎంద‌రినో ప‌ట్టి పీడిస్తోంది.అయితే చేప‌ల్లో ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.

కాబ‌ట్టి, ఎవ‌రైతే ప్రోటీన్ లోపంతో ఇబ్బంది ప‌డుతున్నారు.వారు క‌నీసం మూడు, నాలుగు రోజుల‌కు ఒక‌సారి చేపలు తీసుకోవాలి.

"""/"/ చాలా మంది త‌ర‌చూ హైబీపీ బారిన ప‌డుతుంటారు.శ‌రీరంలో పొటాషియం త‌గ్గ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంటుంది.

అయితే ఇలాంటి వారు కూడా వారంలో ఒక‌టి, రెండు సార్లు చేప‌లు తింటూ ఉండాలి.

ఎందుకంటే, చేప‌ల్లో పాటాషియం అత్య‌ధికంగా ఉంటుంది.ఇక నేటి ఆధునిక కాలంలో ఎంద‌రో నిద్ర లేమితో బాధ ప‌డుతున్నారు.

అయితే నిద్ర లేమి ఉన్న వారు త‌ప్ప కుండా చేప‌లు తీసుకోవాలి.ద్వారా చేప‌ల్లో ఉండే పోష‌కాలు నిద్ర లేమిని దూరంగా చేయ‌డంతో నిద్ర నాణ్య‌త‌ను పెంచుతాయి.

యూదులతో బంధాలు బలోపేతం.. ప్రధాని మోడీపై భారతీయ అమెరికన్ ప్రశంసల వర్షం