ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే టమాటాలు అసలు తినకూడదు..తింటే విషంతో సమానమే..

ప్రతిరోజు చాలామంది ప్రజలు తమ ఇళ్లలో ఉండే కూరలలో కచ్చితంగా టమాటో ఉండవలసిందే.

టమాటా లో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి.వీటిలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అదనంగా ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, పోలేట్, ఐరన్, జింక్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.

కాబట్టి టమాటో తినడం ద్వారా మనం అనేక రకాల పోషకాలను పొందవచ్చు.ఇంకా చెప్పాలంటే టమాటాలు అనేక వ్యాధులను దూరం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి.

కానీ టమాటోలను కొంతమంది మాత్రం అస్సలు తినకూడదు.టమాటాలు ఎవరు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు టమోటాలను అస్సలు తినకూడదు.కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ ముందు దశ, డయాలసిస్ రోగులు, కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు టమాటాలు తీసుకోకూడదు.

కిడ్నీ స్టోన్లు ఒకసారి ఏర్పడి తొలగిపోయినా పదేపదే వస్తున్నా టమాటాలను తినకుండా ఉండడమే మంచిది.

మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు టమాటాలు అసలు తినకూడదు.ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయినా వ్యాధిగ్రస్తులలో పొటాషియం బయటకు వెళ్లకుండా శరీరంలోనే ఉండిపోతుంది.

"""/"/ పొటాషియం రక్తంలో ఉండిపోవడం వల్ల శరీరంలో ట్రాక్సీన్స్ ని సృష్టించి ఉండే ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంది.

అందువల్ల పొటాషియం ఎక్కువగా ఉండే టమాటాలను పూర్తిగా తినకపోవడమే మంచిది.కొంతమంది తమ శరీరక స్థితిని బట్టి కొంత మొత్తంలో తింటారు.

చర్మపు పుండ్లు, తరచుగా చర్మం రంగు మారడం, నిరంతరం పుండ్లు వంటి వాటితో బాధపడేవారు.

టమోటాలను ఎక్కువగా తీసుకోవచ్చు.విటమిన్ ఏ లోపం, కంటి సమస్యలు ఉన్నవారు తరుచుగా టమాటాలు తినవచ్చు.

టమోటాలు గుండె రోగులకు,గుండె బైపాస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి.టమోటాలు అనేగా రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.