మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే, మీరు అదృష్టవంతులే.. ఎలా అంటే?

మనిషి జీవన విధానంలో క్రెడిట్ కార్డ్‌లు ఓ భాగమైపోయాయనే చెప్పుకోవాలి.ఓ సాధారణ ఉద్యోగి కూడా క్రెడిట్ కార్డు ని వాడటం పటిపాటిగా మారిపోయింది.

ఎందుకంటే అత్యవసర సమయంలో డబ్బు అవసరం వున్నపుడైనా, లేదంటే షాపింగ్ చేయాలని అనుకున్నపుడల్లా గుర్తొచ్చేది ఈ క్రెడిట్ కార్డ్స్.

అయితే వీటిని వాడే విషయంలో కాస్త క్లారిటీ ఉండాలి.లేదంటే ఇబ్బందులు పాలవుతారు.

సక్రమంగా వినియోగించుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్‌ పొందవచ్చు.ట్రాన్సాక్షన్‌లపై బెస్ట్ డిస్కౌంట్‌ లను అందించే ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌గా క్రెడిట్‌ కార్డ్‌లను వాడుకోవచ్చు.

తద్వారా రోజువారీ ఖర్చుపై డబ్బు ఆదా చేయడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.జనాలకి వీటిపై అనేక సందేహాలుంటాయి.

అసలు ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్‌ కార్డ్‌లు వినియోగిస్తే మంచిది? ఆ సంఖ్యను ఎలా నిర్ణయించుకోవాలి? వంటి వివరాలు ఇపుడు తెలుసుకుందాం.

మొదటి సారి ఎవరన్నా క్రెడిట్‌ కార్డ్‌ వాడినట్లైతే క్రెడిట్ హిస్టరీ ఉండకపోవచ్చు.మొదటసారి ఇలాంటి కార్డులను వాడినట్లైతే ఆదాయం, ఖర్చు అవసరాల ఆధారంగా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి.

అలాగే ఈ కార్డ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి.మంచి క్రెడిట్ స్కోర్‌ కోసం బిల్లును సకాలంలో తిరిగి చెల్లించాలి.

ఇలా చేయడం ద్వారా చివరికి మరిన్ని బెనిఫిట్స్‌ అందించే హైయర్‌ కేటగిరీ క్రెడిట్ కార్డ్‌ను పొందడానికి అర్హత పొందుతారు.

"""/" / ఇక అతి పెద్ద డౌట్ మనిషి ఎన్ని క్రెడిట్ కార్డులు వాడొచ్చు? Bankbazaar!--com సీఈవో ఆదిల్ శెట్టి మాట్లాడుతూ.

ఈ విషయంపైన క్లారిటీ ఇచ్చారు.మల్టిపుల్‌ క్రెడిట్ కార్డ్‌లు ఉండటం ద్వారా ఎక్కువ క్రెడిట్‌ లిమిట్‌ లభిస్తుందట.

క్రెడిట్ కార్డ్‌లలో ఒకదానిపై పరిమితి అయిపోయినట్లయితే, మరొక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.మల్టిపుల్‌ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, ఖర్చులను అన్నింటికీ డివైడ్‌ చేయవచ్చు.

క్రెడిట్ వినియోగ నిష్పత్తిని సులభంగా తగ్గించవచ్చు, తద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుందని చెబుతున్నారు.

కూటమి పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం ?