జిడ్డు చర్మంతో చింతేలా.. ఈ చిట్కాను పాటిస్తే సులభంగా సమస్యకు బై బై చెప్పవచ్చు!

సాధారణంగా కొందరి చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది.ఇలాంటి వారు మేకప్ వేసుకోవడానికి జంకుతుంటారు.

ఎందుకంటే మేకప్ వేసుకున్న కొద్ది నిమిషాల‌కే ముఖం మొత్తం ఆయిలీ ఆయిలీగా మారిపోతుంటుంది.

మేకప్ క్షణాల్లో చెదిరిపోతుంది.పైగా జిడ్డు చర్మ తత్వం కారణంగా మొటిమలు, మచ్చలు వంటివి తీవ్రంగా వేధిస్తుంటాయి.

చర్మం ఎప్పుడు డల్ గా కనిపిస్తుంది.ఈ క్రమంలోనే జిడ్డు చర్మాన్ని వదిలించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను పాటిస్తే ఆయిలీ స్కిన్ కు బై బై చెప్పవచ్చు.

మరి లేటెందుకు ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో కడిగి సన్నగా తురుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.

"""/" / అలాగే పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ ను వేసుకోవాలి.

చివరిగా సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం చేతి వేళ్ల‌తో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

"""/" / ప్రతిరోజు ఉదయం ఈ చిట్కాను పాటిస్తే.డే మొత్తం చర్మం ఫ్రెష్ గా మరియు గ్లోయింగ్ గా మెరుస్తుంది.

స్కిన్ ఆయిలీ ఆయిలీగా మారకుండా ఉంటుంది.పైగా ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల చర్మం వైట్ గా టైట్ గా మారుతుంది.

ముదురు రంగు మచ్చలు మాయమవుతాయి.స్కిన్ టోన్ ఈవెన్ గా సైతం మారుతుంది.

మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..