జుట్టు రోజురోజుకు పలుచగా మారుతుందా? వర్రీ వద్దు ఇలా చేయండి!

పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం తదితర అంశాల కారణంగా కొందరి జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.

కానీ హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది ఉండదు.దీని కారణంగా జుట్టు రోజురోజుకు పలుచగా మారుతుంటుంది.

దీంతో తెగ హైరానా పడిపోతుంటారు.అయితే వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

అదే సమయంలో పలుచగా మారిన జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా తయారవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులు( Dry Rosemary ) వేసుకోవాలి.

చివరిగా రెండు బిర్యానీ ఆకులు( Bay Leaf ) తీసుకుని తుంచి వాటర్ లో వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఉడికించిన మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్‌ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం ( Ricinus )వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

"""/" / వారానికి కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే కనుక జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

అదే సమయంలో పలుచటి జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పెరుగుతుంది.రోజురోజుకు జుట్టు పలుచగా మారిపోతుందని బాధపడుతున్న వారికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తుంది.

మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి.

వెన్ను నొప్పికి కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలి..?