జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఇలా చేయండి!
TeluguStop.com
జుట్టు హెవీగా రాలిపోతుందా? ఎన్ని రకాలుగా ప్రయత్నించిన హెయిర్ ఫాల్( Hairfall ) అదుపులోకి రావడం లేదా? రోజు రోజుకు కురులు పల్చగా మారుతున్నాయా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ప్రయత్నిస్తే కనుక జుట్టు రావడం తగ్గడమే కాదు ఒత్తుగా పెరగడం కూడా ప్రారంభమవుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం( Rice ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు,( Fenugreek ) నాలుగు లవంగాలు( Cloves ) మరియు అర కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యం, మెంతులు మరియు లవంగాలను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసి మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఆపై జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ మాస్క్ ను కనుక వేసుకుంటే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.
జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ మాస్క్ జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.
జుట్టు దట్టంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. """/" /
హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారికి, హెయిర్ గ్రోత్ లేదని సతమతం అవుతున్నవారికి ఇప్పుడు చెప్పకున్న హోమ్ రెమెడీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.మరియు జుట్టు ఆరోగ్యం కోసం ఒత్తిడికి దూరంగా ఉండండి.
కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, సీడ్స్, పాలు, గుడ్లు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.
జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ధూమపానం, మద్యపానం అలవాట్లను కూడా వదులుకోండి.
Cool Bet Im Überblick: Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten