ఈ మిరాకిల్ రెమెడీని ఫాలో అయితే వయసు పైబడిన వైట్ హెయిర్ రాదు!

తెల్ల జుట్టు( White Hair ) వృద్ధాప్యానికి సంకేతం.ఏజ్ పెరిగే కొద్ది జుట్టులో మెలనిన్( Melanin ) ఉత్పత్తి తగ్గి తెల్లబడటం స్టార్ట్ అవుతుంది.

కానీ నేటి రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది.

అయితే తెల్ల జుట్టు వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుని బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే తెల్ల జుట్టును అడ్డుకునేందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పవర్ ఫుల్ గా పని చేస్తాయి.

ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ హోమ్ రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.ముందుగా ఒక కప్పు పుదీనా ఆకులు( Mint Leaves ) మరియు అర కప్పు తులసి ఆకులను( Tulsi Leaves ) మిక్సీ జార్ లో వేసి వాటర్ సహాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna Powder ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు సరిపడా తులసి పుదీనా జ్యూస్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని మూత పెట్టి గంట పాటు వదిలేయాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

నెలకు ఒకసారి ఈ మిరాకిల్ రెమెడీని కనుక ఫాలో అయితే వయసు పైబడిన వైట్ హెయిర్ మాత్రం మీ వంక కూడా చూడదు.

"""/" / ఈ రెమెడీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటుంది.

కురుల‌ను నల్లగా నిగ‌నిగ‌లాడేలా మెరిపిస్తుంది.అలాగే ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల జుట్టు రాలడం, విరగడం, చిట్ల‌డం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

జుట్టు కుదుళ్లు బలంగా మరియు ఆరోగ్యంగా మారతాయి.

అమ్మను కావాలని ఉంది… సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత?