ఈ లడ్డూను రోజుకొకటి తింటే నీరసం, అలసట పరార్ అవుతాయి..!
TeluguStop.com
నీరసం, అలసట అనేవి అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యలు.ముఖ్యంగా మహిళల్లో మరింత అధికంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి.
వీటిని వదిలించుకోకుంటే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.అలాగే మరెన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే నీరసం అలసట ను నివారించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.
అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే లడ్డు ఒకటి.ఈ లడ్డూను రోజుకొకటి తింటే నీరసం, అలసట పరార్ అవుతాయి.
అదే సమయంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.మరి లేటెందుకు ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలి.
? మరియు దాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పది గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.
ఈ లోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు రోల్డ్ ఓట్స్ వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు పల్లీలు వేసి బాగా వేయించుకుని పొట్టు తొలగించి పెట్టుకోవాలి.
"""/"/
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఖర్జూరాలు, వేయించుకున్న ఓట్స్, పల్లీలు, చిటికెడు బ్లాక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఒక బాక్స్ లో నింపి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
సూపర్ టేస్టీగా ఉండే ఈ ఓట్స్ పీనట్ లడ్డూలను రోజుకొకటి చొప్పున తీసుకుంటే నీరసం అలసట అన్నమాట అనరు.
"""/"/
అలాగే శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
మెటబాలిజం రేటు రెట్టింపు అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
అలాగే ఈ హెల్తీ లడ్డూలను తీసుకోవడం వల్ల రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.
గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.
మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.మరియు ఈ లడ్డూలను డైట్ లో చేర్చుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య సైతం అదుపులోకి వస్తుంది.
పవన్ దూకుడుపై టీడీపి అలెర్ట్ ! బిజేపి పై అనుమానం ?