నెలసరి సమయంలో విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

రుతుచక్రం ( Menstrual Cycle )ప్రారంభం అయినప్పటి నుంచి ఆడవారిని ప్రతినెల నెలసరి పలకరిస్తూనే ఉంటుంది.

కొందరికి నెలసరి చాలా సాఫీగా సాగిపోతుంది.కానీ కొందరికి మాత్రం ఎంతో బాధాకరంగా ఉంటుంది.

ముఖ్యంగా నెలసరి సమయంలో విపరీతమైన నడుము నొప్పితో( Back Pain ) బాధపడుతుంటారు.

నడుము నొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.నడుము నొప్పిని తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.

కానీ పెయిన్ కిల్లర్స్ తో పని లేకుండా సహజంగా కూడా నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే లడ్డూ చాలా బాగా సహాయపడుతుంది.ప్రతిరోజు ఈ లడ్డూను కనుక తీసుకుంటే నెలసరి సమయంలో నడుము నొప్పే కాదు ఎటువంటి నొప్పులు రావు.

మరి ఇంతకీ ఆ లడ్డూ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) వేసి దోరగా వేయించుకోవాలి.

అలాగే అర కప్పు నువ్వులు ( Cup Sesame Seeds )కూడా వేసుకుని వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అవిసె గింజలు, నువ్వులు, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఆ త‌ర్వాత అదే మిక్సీ జార్ లో అర కప్పు గింజ తొలగించిన సాఫ్ట్ ఖర్జూరాలు( Dates ) వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

చివరిగా ఇందులో అవిసె గింజలు నువ్వులు పొడి కూడా కలిపి మరోసారి గ్రైండ్ చేసుకుని లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.

"""/" / ఈ అవిసె గింజల లడ్డూ ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

ఈ లడ్డూను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా ఆడవారు తమ డైట్ లో ఈ అవిసె గింజల లడ్డూను చేర్చుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది.

నెలసరి సమయంలో నడుము నొప్పి కడుపు నొప్పి తదితర నొప్పులు వేధించకుండా ఉంటాయి.

"""/" / అలాగే ఈ ల‌డ్డూలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది.ఇది మలబద్ధకాన్ని దూరం చేయ‌డంలో మరియు జీర్ణశక్తిని పెంచడంలో స‌హాయ‌ప‌డుతుంది.

విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉండే ఈ అవిసె గింజ‌ల ల‌డ్డూ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని చిత్తు చేస్తుంది.డయాబెటిస్‌, గుండె జబ్బులు వ‌చ్చే ప్ర‌మాదాన్ని త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది.

మ‌రియు మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది.

పీకల దాక తాగేసిన యువతి.. ఆ కంట్రీ ఫ్లైట్ తీసుకోబోయి తప్పు చేసిందే..?