క్రమం తప్పకుండా ఈ పండ్లను తింటే .. తెల్లగా మెరిసే అందమైన చర్మం మీ సొంతం..!

పచ్చని ఆకుకూరలు( Green Vegetables ), పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని దాదాపు చాలామంది ప్రజలకు తెలుసు.

మరి ముఖ్యంగా సీజనల్ పండ్లు తినాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.అందుకు కారణం పండ్ల లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

చర్మానికి పునరుజ్జీవం ఇవ్వడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.నారింజ, బొప్పాయి, కివీస్ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది చర్మానికి అవసరమైన కొల్లాజెన్ నీ అందిస్తుంది.చర్మ నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్లు పండ్లలో అధికంగా ఉంటాయి.

అందుకే ఏ ఏ పండ్లు తింటే చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలోని వ్యర్ధాలు బయటకు పంపించాలన్న, ఫ్రీ రాడికల్స్( Free Radicals ) తో పోరాడాలి అన్న బెర్రీలు, ద్రాక్ష,దానిమ్మ పండ్లు క్రమం తప్పకుండా తింటూ ఉండాలి.

"""/" / వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) వృద్ధాప్యాచాయాలు, చర్మ సమస్యలు రాకుండా నిరోధిస్తాయి.

పుచ్చకాయ, కీరదోస, స్ట్రాబెరీ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముడతలు, గీతలు పోగొట్టి యవ్వనంగా కనిపించలా చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లలో ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి.

ఇవి మృతకణాలను ఎక్స్ ఫోలియేట్ ( Ex Foliate )చేయడానికి రంద్రాలను అన్ లాగ్ చేయడానికి చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే చెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి చర్మంలోని మంట, ఎరుపును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అందుకే వివిధ రకాల పండ్లను క్రమం తప్పకుండా తింటే మెరిసే ఛాయా ఆరోగ్యకరమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

దీనితో పాటు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం వల్ల కూడా మెరిసే తెల్లగా మెరిసే అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.. వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!