ఎంత బరువు ఉన్నా సరే రోజు మార్నింగ్ ఈ టీ తాగితే నాజూగ్గా మారతారు!

ఇటీవల రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా కోట్లాది మందికి అధిక బరువు అనేది పెద్ద శత్రువు గా మారింది.

బరువు పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం చుట్టేస్తుంటాయి.అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే టీ ను రోజు మార్నింగ్ తాగితే ఎంత బరువు ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ను పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న కుంకుమపువ్వు, ఎనిమిది నుంచి పది ఫ్రెష్ పుదీనా ఆకులు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు లెమన్ స్లైసెస్ వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేస్తే కుంకుమపువ్వు టీ సిద్ధమవుతోంది.

ఈ టీ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీని కనుక తీసుకుంటే శరీరంలో క్యాలరీలు త్వరగా కరుగుతాయి.

దీంతో లావుగా ఉన్న మీరు కొద్ది రోజుల్లోనే సన్నగా మారతారు. """/"/ అంతేకాదు ఈ కుంకుమ పువ్వు టీ తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.

మైండ్ రిఫ్రెష్ అవుతుంది.శరీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి.

రక్తపోటు అదుపులో ఉంటుంది.చర్మం నిగారింపుగా మరియు యవ్వనంగా సైతం మెరుస్తుంది.

కాబట్టి అధిక బరువు ఉన్నవారు మాత్రమే కాదు ఎవ్వరైనా ఈ టీ ను డైట్ లో చేర్చుకోవచ్చు.

నిజ్జర్ హత్య కేసు : భారత్‌పై మరోసారి ఆరోపణలు చేసిన ఇండో కెనడియన్ నేత జగ్మీత్ సింగ్