రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా? అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
TeluguStop.com
రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదు అని చెప్పే వారి సంఖ్య ఇటీవల రోజుల్లో భారీగా పెరిగిపోతోంది.
ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, నిద్ర సమయాన్ని వేస్ట్ చేస్తూ టీవీ, స్మార్ట్ ఫోన్లతో గడపడం, ఒత్తిడి వంటి రకరకాల కారణాల వల్ల నిద్ర కరువవుతుంది.
కంటి నిండా నిద్ర లేకుంటే అధిక బరువు దగ్గర నుంచి గుండె పోటు వరకు ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి.
అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఎంతో అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదని బాధపడేవారు.టెన్షన్ పడకుండా ఇప్పుడు చెప్పబోయే టీను డైట్‌లో చేర్చుకోండి.
ఈ టీ ప్రశాంతమైన నిద్రను అందించడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం చేకూరుస్తుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో గుప్పెడు మునగాకు, దంచి పెట్టుకున్న చిన్న పసుపు కొమ్ము ముక్క, చిటికెడు మిరియాల పొడి, చిన్న దంచిన అల్లం ముక్క వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సాయంతో టీని ఫిల్టర్ చేసుకోవాలి.చివరిగా రుచికి సరిపడా తేనెను కలుపుకుంటే.
టర్మరిక్ అండ్ మోరింగ టీ సిద్ధం అవుతుంది. """/"/
రాత్రుళ్లు నిద్ర పోవడానికి గంట ముందు ఈ టీని సేవించాలి.
తద్వారా అందులో ఉండే ప్రత్యేక సుగుణాలు చక్కటి నిద్రను అందిస్తాయి.అంతేకాదు.