ఈ పాలు రోజు తాగితే కీళ్ల నొప్పులు అన్నమాటే అనరు!

వయసు పైబ‌డే కొద్దీ కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టడం సర్వ సాధారణం.అయితే ఇటీవల రోజుల్లో ముప్పై ఏళ్ల వారు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.

అందుకు కారణం బలహీనమైన ఎముకలే.అయితే ఇప్పుడు చెప్పబోయే పాలు రోజు తాగితే బలహీనమైన ఎముకలు బలంగా దృఢంగా మార‌తాయి.

అలాగే కీళ్ల నొప్పులు అన్న మాటే.మరి ఇంతకీ ఆ పాలు ఏంటి.

? వాటిని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు ఎండు ఖర్జూరాలు, ఒక ఎండిన అత్తిపండు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాల నుండి గింజను తొలగించుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో గింజ తొలగించిన ఎండు ఖర్జూరాలు మరియు అత్తిపండు ను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/"/ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు ఆవు పాలు వేసుకోవాలి.

పాలు కాస్త మరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం మిశ్రమాన్ని వేసి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి ఖర్జూర్ మిల్క్ ను గ్లాసు లోకి సర్వ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

"""/"/ ఈ ఖర్జూరం పాలు ప్రతిరోజూ తీసుకుంటే కనుక అందులో ఉండే క్యాల్షియం మరియు ఇతర పోషకాలు ఎముకలను దృఢంగా బలంగా మారుస్తాయి.

ఎముకల బలహీనతను నివారిస్తాయి.కీళ్ల నొప్పులు సైతం దూరం అవుతాయి.

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ ఖర్జూరం పాలు వ‌రం అని చెప్పొచ్చు.

ప్రతిరోజు ఈ ఖర్జూరం పాలు తీసుకుంటే కీళ్ల నొప్పులు అన్న మాటే అనరు.

రామ్ చరణ్ లోకేష్ కనక రాజ్ కాంబో లో సినిమా వచ్చేది అప్పుడేనా..?