రాత్రి నిద్రపోయే ముందు పాలను ఇలా తాగితే.. ఆరోగ్యానికి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

పూర్వకాలంలో ఎక్కువగా రాత్రి నిద్రపోయే ముందు చాలామంది పాలు( Milk ) తాగి నిద్రపోయేవారు.

అయితే ప్రస్తుత సమాజంలో క్రమక్రమంగా ఈ అలవాటు తగ్గుతూ వచ్చింది.అయితే దీన్ని మళ్లీ అంతా అలవాటుగా చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రి నిద్రపోవడానికి ఒక అరగంట ముందు చక్కగా ఒక గ్లాసు వేడి పాలను తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

పాలు ఎలా తాగితే ప్రయోజనమో, దాని లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నిద్రపోవడానికి ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది.

ఇలా క్రమం తప్పకుండా రోజు పాలు తాగడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.

అందువల్ల ఎముకలు బోలుగా మారడం, నొప్పులు లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. """/" / అందువల్ల ఒత్తిడి, ఆందోళన లాంటివి దూరమవుతాయి.

చాలామందికి ఉదయం లేవడంతోనే నీరసంగా ఉంటుంది.బలహీనంగా ఉంటారు.

అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ( Health Benefits )ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఉదయం నిద్ర లేచినప్పుడు ఉషారుగా ఉంటారు.పాలలో ట్రైప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్ ఉంటుంది.

ఇది కండరాలు, న్యూరో ట్రాన్స్‌ మీటర్లు, ఎంజైముల్లాంటివి చేయడానికి ఉపయోగపడుతుంది.చక్కని నిద్ర కూడా పడుతుంది.

నిద్ర నాణ్యతను పెంచడానికి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి.కొంతమందికి అర్థరాత్రి విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది.

అలాంటి వారు నిద్రలేచి ఏదో ఒకటి తింటూ ఉంటారు.అలా సమయం కాని సమయంలో తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

"""/" / అలా కాకుండా నిద్రకు ముందు గ్లాసుడు పాలు తాగడం వల్ల రాత్రి సమయంలో ఆకలి వేయకుండా ఉంటుంది.

రాత్రి పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.కాబట్టి గుండె ఆరోగ్యంగా( Heart Healthy ) ఉంటుంది.

రాత్రి సమయంలో పాలు ఎలా తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్న కొంత మంది పాలను తాగేందుకు ఇష్టపడరు.

పంచదార, ఇతర ఎనర్జీ పౌడర్లు వేసుకుని తాగుతూ ఉంటారు.ఇవన్నీ ఆరోగ్యం పై ఎంత చెడు ప్రభావాన్ని చూపుతాయో అస్సలు తెలియదు.

కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాలలో బెల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసుకుని త్రాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్రహ్మానందం సినిమాలు తగ్గించడానికి అసలు కారణమిదా.. ఆయన ఏం చెప్పారంటే?