ఆ ఊర్లోకి తాగొస్తే మ‌ట‌న్ దావ‌త్ ఇవ్వాల్సిందేన‌ట‌..

మద్యానికి బానిస అయిన వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం.వారి చేత మందు మానిపించాలంటే అదో పెద్ద టాస్క్.

మందుబాబులను రిహాబిలిటీ సెంటర్లకు తీసుకెళ్లినా ఒకరు లేదా ఇద్దరిలో మాత్రమే మార్పు చూడొచ్చు.

మిగతా వారు శరామాములే.చుక్క పడకపోతే కింద మీద చేస్తుంటారు.

మద్యంతో నేరాలకు అవినాభావ సంబంధం కూడా ఉంటుంది.అయితే, మద్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు ఆ ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయంతో ప్రజలు పూర్తిగా మందుకు దూరమయ్యారు.

ఒకవేళ ఎవరైనా మందుతాగి దొరికితే వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగుతోంది.వాటిలో అహ్మదాబాద్‌, అమ్రేలీ, సురేంద్రనగర్, కచ్, మోతిపుర వంటి జిల్లాలు ఉన్నాయి.

ఇక్కడ గ్రామాల మధ్యలో బోనులను ఏర్పాటు చేశారు.మద్యం తాగి ఎవరైనా పట్టుబడితే వారిని రాత్రంతా అందులో ఉంచుతారు.

ఓ రోజంతా ఉన్నాక రూ.1200 జరిమానా కడితేనే వదిలేస్తారు.

"""/"/ అంతటితోనే అయిపోలేదు.బోను ఉంచి బయటకు వచ్చాక రూ.

25వేల ఖర్చుతో ఊరు మొత్తానికి మటన్‌తో దావత్ ఇవ్వాల్సిందే.ఊరిలోని ప్రజలంతా దావత్ కు వస్తారు.

ఈ శిక్షను కాదంటే గ్రామం నుంచి బహిష్కరిస్తారు.అతనికి గ్రామంలో ఎవరూ సాయం చేయరు.

ఇదంతా వినడానికి కొత్తాగా అనిపించినా అక్కడ సెక్సెస్ అయ్యింది.ఎవరూ మందు తాగడం లేదు.

పక్కఊరి వారు ఎవరైనా తాగి పట్టుబడితే గ్రామ పంచాయతీకి రూ.1200 జరిమా నా చెల్లించాలి.

తాగిన వారిని పట్టుకోవడానికి ఇక్కడి మహిళలు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తుంటారు.వారికి రూ.

501 నుంచి రూ.1100 నజరానా కూడా చెల్లిస్తున్నారు.

ఈ వింత నిబంధనలను కచ్ జిల్లా మాండ్వి మండలం గాధీసా గ్రామంలోని రాజన్ నాట్ -2021’ ఏప్రిల్ నెలలో ఈ బోను శిక్షను అమలులోకి తీసుకొచ్చారు.

ప్రస్తుతం గ్రామంలోని ప్రజలంతా మద్యానికి దూరంగా ఉంటూ సుఖశాంతులతో జీవిస్తున్నారని గ్రామపెద్దలు తెలిపారు.

పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి..: సజ్జల