గ్రీన్ టీ ను నేరుగా కాకుండా ఇలా తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు తెలుసా?

గ్రీన్ టీ.దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ తమ డైట్ లో గ్రీన్ టీను చేర్చుకుంటున్నారు.

ముఖ్యంగా బరువు తగ్గడం కోసం ప్రయత్నించేవారు తప్పకుండా రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ ని తాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

వెయిట్ లాస్ కి గ్రీన్ టీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.అయితే గ్రీన్ టీ ను నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.

అదే సమయంలో మరెన్నో అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ టీ ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ ను వేసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఐదు లవంగాలు వేసి ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత గ్రీన్ టీని ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఈ లోపు ఒక చిన్న పైనాపిల్ ను తీసుకుని తొక్క చెక్కేసి వాట‌ర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో పైనాపిల్‌ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/"/ ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో సగం వరకు పైనాపిల్ జ్యూస్ ను వేసుకోవాలి.

ఆపై సగం గ్రీన్ టీను వేసుకుని రెండు ఐస్ క్యూబ్స్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసి తాగేయడమే.

గ్రీన్ టీ ను నేరుగా తీసుకోలేకపోతుంటారు.అలాంటి వారు ఈ డ్రింక్ ను ట్రై చేయవచ్చు.

ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది.మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

"""/"/ అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మెదడు సూపర్ షార్ప్ గా మారుతుంది.

మధుమేహం, గుండె జబ్బులు బారిన పడకుండా ఉంటారు.చర్మం నిత్యం నిగారింపుగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

ఇక‌పోతే పైనాపిల్ జ్యూస్ కు బదులుగా ఆరెంజ్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ ను కూడా ఉపయోగించవచ్చు.