ఇక్కడ బీరు తాగితే మనిషి బేజారే!

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రంలో ఓ యువకుడు సోమవారం సాయంత్రం సరదాగా స్నేహితులతో కలిసి బీరు తాగుదామని వైన్స్ దగ్గరకు వెళ్ళాడు.

బీరు బాటిల్ కొని తాగాడు.వెంటనే కడుపులో తిప్పినట్లుగా ఉండి వాంతులు చేసుకుని అస్త్యస్థతకు గురయ్యాడు.

బీరు బాటిల్ ను పరిశీలించగా,బీరు బాటిల్ లో చెత్త కనబడింది.వెంటనే వైన్స్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి బీరులో చెత్త ఉందని, తాగగానే వాంతులు అయ్యాయని,ఇలాంటి బీరు అమ్మితే ఎలా అని ప్రశ్నించగా,సదరు వైన్స్ షాప్ యాజమాన్యం మా చేతుల్లో ఏమీ లేదని,హైదరాబాద్ వెళ్లి కంపెనీ వద్దకు వెళ్ళి అడగమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి చేతులు దులుపుకున్నారని బాధిత మందు బాబు అవేదన వ్యక్తం చేశాడు.

నోటి దూల కారణంగా కోటి రూపాయలు నష్టపోయిన తేజ..??