ఉప్పుతో ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా..
TeluguStop.com
మన వంటింట్లో ఎప్పుడూ ఉండే ఉప్పుతో మనం కొన్ని రకాల పరిహారాలను చేయడం వల్ల మన ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ దూరం వెళ్లే అవకాశం ఉంది.
అంతే కాకుండా ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఏర్పడతాయి.
వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును వివిధ రకాలుగా ఉపయోగించడం మంచిది.ఉప్పును పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు.
ఇంకా చెప్పాలంటే ఉప్పుతో ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.అలసట, నిరాశ, ప్రతికూల శక్తితో బాధపడుతున్నప్పుడు ఉప్పు నీటితో స్నానం చేయడం ఎంతో మంచిది.
మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి తల స్నానం చేయడం వల్ల పునర్జీవనం శక్తివంతంగా ఉన్న అనుభూతిని పొందే అవకాశం ఉంది.
అదే విధంగా కోరుకున్న ఫలితాలను పొందకపోతే ప్రతిరోజు ఉదయం చేతిలో కొంచెం ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ ఐదు నుంచి ఏడుసార్లు చుట్టి ఆ తర్వాత ఆ ఉప్పు నీటిలో వేయడం మంచిది.
ఇలా చేయడం వల్ల ఆ ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది.ఇంట్లో డబ్బు కొరతా ఏర్పడినప్పుడు నైరుతి మూలలో ఒక గ్లాసు ఉప్పు కలిపి నీటిని ఉంచడం వల్ల డబ్బు పెరగడంతో పాటు ఆర్థిక సమస్యలు దూరమై ఎంతో ఉపశమనం లభిస్తుంది.
"""/" /
అంతేకాకుండా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కాస్త ఉప్పు వేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యే అవకాశం ఉంది.
ఇంట్లోని దుమ్ము లేదా దూళి అన్ని వస్తువులు అలంకరణ వస్తువులను ఉప్పునీటితో శుభ్రం చేయడం ఎంతో మంచిది.
నీటిలో కాస్త ఉప్పు వేసి వస్తువులను శుభ్రం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.
మీ బాత్రూం వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఉప్పును ఉపయోగించడం వల్ల ప్రతికూల ఫలితాలను తగ్గించుకునే అవకాశం ఉంది.
నిత్యం నిమ్మరసం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..!