గుడ్డుతో ఇలా చేస్తే పిగ్మెంటేషన్‌కు బై బై చెప్పొచ్చు!
TeluguStop.com
పిగ్మెంటేషన్.కోట్లాది మంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
వయసు పైబడే కొద్ది శరీరంలో వచ్చే మార్పుల కారణంగా చర్మం పిగ్మెంటేషన్‌కు గురికావడం సర్వ సాధారణం.
కానీ, యంగ్ ఏజ్‌లో ఉన్నవారు సైతం పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారు.ఎండల్లో అధికంగా తిరగడం, మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, కాలుష్యం, ప్రసవం, ఆహారపు అలవాట్లు, గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి రకరకాల కారణాల వల్ల పిగ్మెంటేషన్ సమస్య ఏర్పడుతుంది.
దీని వల్ల చర్మ సౌందర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.దాంతో పిగ్మెంటేషన్‌ను వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
ఎందుకంటే, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే గుడ్డుతోనే సులభంగా పిగ్నెంటేషన్‌కు బై బై చెప్పొచ్చు.
మరి ఇంకెందును ఆలస్యం గుడ్డును చర్మానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక మీడియం సైజ్ బంగాళదుంపను తీసుకుని తొక్క చెక్కేసి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
"""/" /
ఈ బంగాళదుంప ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి.
జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చసొన, రెండు టేబుల్ స్పూన్ల బంగాళదంప జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి.
అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఏదైనా బ్రష్ సాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల అనంతరం వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
ఇలా గుడ్డుతో రోజుకు ఒకసారి గనుక చేస్తే పిగ్నెంటేషన్ సమస్య క్రమంగా దూరమై ముఖం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది.
డెలివరీ సమయంలో డాక్టర్ పాడు పని.. రూ.11 కోట్ల జరిమానా విధించిన కోర్టు!