కాఫీ బీన్స్‌తో ఇలా చేస్తే వైట్ హెయిర్ సమస్యకు దూరంగా ఉండొచ్చు!
TeluguStop.com

ఇటీవల రోజుల్లో అత్యధిక శాతం మందిని తీవ్రంగా కలవర పెడుతున్న సమస్య వైట్ హెయిర్.


వయసు పైబడిన తర్వాత వైట్ హెయిర్ వచ్చినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.


కానీ, వయసు పైబడక ముందే వైట్ హెయిర్ వస్తే.ఇక వారి బాధ వర్ణణాతీతం.
తెల్ల జుట్టును దాచి పెట్టేందుకు తరచూ కలర్స్ వేసుకుంటారు.ఏవేవో ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.
ఇలా రకరకాల పద్ధతులను ఫాలో అవుతూ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అందుకే తెల్ల జుట్టు వచ్చాక ఇబ్బంది పడటం కంటే.
రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో ఉత్తమం.అయితే అందుకు కాఫీ బీన్స్ అద్భుతంగా సహాయపడతాయి.
కాఫీ బీన్స్‌లో ఉండే కొన్ని ప్రత్యేక సుగుణాలు జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది.
దాంతో తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.మరి ఇంతకీ కాఫీ బీన్స్‌ను జుట్టు ఎలా ఉపయోగించాలి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి.
పాన్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు కాఫీ బీన్స్‌ను వేసి.ఒకే ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న కాఫీ బీన్స్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోయాలి.
అలాగే కాఫీ బీన్స్ పొడి కూడా వేసి చిన్న మంటపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
"""/"/
ఇలా మరిగించిన ఆయిల్‌ను పూర్తిగా చల్లారాక.పల్చటి వస్త్రం సాయంతో సపరేట్ చేసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.
ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే కురులు నల్లగా నిగనిగలాడతాయి.
తెల్ల జుట్టుకు దూరంగా ఉండవచ్చు.
పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నగళ్ల.. ఈ నటి నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే!