4 బాదం పప్పులతో ఇలా చేశారంటే మీ ముఖం చంద్రబింబమే!!

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నట్స్ లో బాదం పప్పు( Almonds ) ముందు వరసలో ఉంటుంది.

ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు బాదం పప్పులో మెండుగా నిండి ఉంటాయి.

నిత్యం బాదం పప్పులను తినడం వల్ల అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి.అయితే బాదం పప్పులో బ్యూటీ సీక్రెట్స్ కూడా ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మృదువుగా మరియు కాంతివంతంగా మెరిపించడంలో బాదం పప్పు అద్భుతంగా తోడ్పడుతుంది.

అందుకోసం బాదం పప్పును ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా రెండు గిన్నెలు తీసుకుని ఒక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ మినుములు.

( Black Gram ) మరొక దాంట్లో నాలుగు బాదం పప్పులు వేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఆపై వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మినుములు మరియు నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పు వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood ) మరియు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు( Milk ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని ఫాలో అయితే మీ ముఖం చంద్రబింబం మాదిరి మెరిసిపోతుంది.

బాదం, మినుములు, పాలు, చందనం ఇవన్నీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చర్మ కణాలను లోతుగా శుభ్రం చేస్తాయి.

మొటిమలు, మచ్చలు ఏమైనా ఉంటే వాటిని క్రమంగా వదిలిస్తాయి.స్కిన్ కలర్ ను మెరుగు పరుస్తాయి.

బాదం పప్పులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తాయి.చర్మాన్ని యవ్వనంగా మృదువుగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

కాబట్టి సహజంగానే అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ఫాలో అవ్వండి.

అమ్మ వైద్యం కోసం నెలకు రూ.లక్ష ఖర్చవుతోంది.. శ్రీసత్య షాకింగ్ కామెంట్స్ వైరల్!