జీతం రాగానే ఇలా చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పై..
TeluguStop.com
సాధారణంగా ప్రతి ఒక్కరూ బాగా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటారు.
తమ కోరిక మేరకు ఉద్యోగం లేక అనుకున్నంత జీతం రాక చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ జీవిస్తున్నారు.
ఉద్యోగంతో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగి తన జీతం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
ఎందుకంటే ఈ జీతంతోనే అతనీ ఇల్లు నడుస్తోంది.మిగిలిన కుటుంబ అవసరాలు కూడా తీరిపోతాయి.
చాలామంది ఈ జీతం నుంచి కూడా పొదుపు చేస్తారు.కానీ చాలామంది వారికి ఖర్చులు ఎక్కువగా ఉన్నందున పొదుపు చేయడంలో విఫలమవుతూ ఉంటారు.
ఈ రోజు ఈ సమస్యకు జ్యోతిష్య శాస్త్రంలో పరిష్కారాన్ని తెలుసుకుందాం.ఈ పరిష్కారం అనుసరించడం వల్ల మీ ఇంట్లో సంపద మరియు శ్రేయస్సు పెరుగుతూనే ఉంటాయి.
మీకు జీతం వచ్చిన వెంటనే ముందుగా దానధర్మాలు చేయండి.ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
"""/"/
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు జీతం వచ్చిన వెంటనే ముందుగా దానధర్మాలు చేయడం మంచిది.
మత గ్రంధాలలో దాతృత్వం గొప్ప ధర్మంగా పరిగణిస్తారు.నిత్యం దానధర్మాలు చేసేవారు జనన, మరణ బంధాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని వేద పండితులు చెబుతున్నారు.
కాబట్టి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా దాన్ని సరిగ్గా దానం చేయడం మంచిది.
ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.జీతం పొందిన తర్వాత మీరు పేదలకు ఆహారం ఇవ్వవచ్చు.
"""/"/
అంతే కాకుండా వారికి బట్టలను దానం చేయవచ్చు.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి.
నిరుపేదలకు దానం చేయడమే కాకుండా జీతంతో కొన్న పిండితో రోటీలు చేసి ఆవులకు తినిపించడం మంచిది.
అంతే కాకుండా ఆవులకు మేత నీరు కూడా సక్రమంగా అందించాలి.ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి ఆ వ్యక్తిపై శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గోమాతకు రొట్టె తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
అక్కడ కూడా సత్తా చాటిన బాలయ్య.. ఇకపై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కానున్నాయా?