మే 31న గాయత్రీ మాతకు ఇలా పూజ చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!
TeluguStop.com
హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట శుక్ల ఏకాదశి( Jyeshta Shukla Ekadashi ) రోజున హిందువులు గాయత్రీ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
గాయత్రీ జయంతి మే 31 బుధవారం రోజు జరుపుకోనున్నారు.హిందువులు ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధి రోజు గాయత్రీ మాత జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ రోజున భక్తి శ్రద్ధలతో మాత గాయత్రిని పూజించిన వారికి సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
"""/" /
అంతే కాకుండా గాయత్రి జయంతి( Gayatri Jayanti ) రోజు రాత్రి గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల అనే ప్రయోజనాలు లభిస్తాయి.
అలాగే ఈ సంవత్సరం గాయత్రి జయంతి ఎప్పుడు వస్తుంది, దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్( Hindu Calendar ) ప్రకారం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున గాయత్రి జయంతి ఎంతో ఉత్సాహంగా ప్రజలు జరుపుకుంటారు.
గాయత్రి జయంతి ఈ ఏడాది మే 31న బుధవారం రోజు వస్తుంది.ఈ రోజున నిర్జల ఏకాదశినీ కూడా ప్రజలు జరుపుకుంటారు.
పూజా సమయం మే 30 2023న మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషములకు మొదలవుతుంది.
ఇది మరుసటి రోజు మే 31 2023 మధ్యాహ్నం 1:45 నిమిషములకు ముగిసిపోతుంది.
హిందూ మత విశ్వాసాల ప్రకారం గాయత్రి జయంతి రోజున కనీసం 108 సార్లు రాత్రి గాయత్రీ మంత్రాన్ని జపించాలి.
ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, ఆనందం ఎప్పుడు ఉంటుంది.మీరు మీ లక్ష్యాన్ని కూడా సులభంగా సాధించవచ్చు.
"""/" /
ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రి జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.సంప్రదాయం ప్రకారం గాయత్రి దేవి నాలుగు వేదాలకు మూలంగా ప్రజలు భావిస్తారు.
గాయత్రి దేవిని తల్లి సరస్వతి, లక్ష్మీ ( Saraswati , Lakshmi )మరియు కాళికి ప్రతీకగా భావిస్తారు.
వేదాలు గాయత్రీ దేవి నుంచి ఉద్భవించాయి కాబట్టి ఆమెను వేదమాత అని కూడా ప్రజలు పిలుస్తారు.
సనాతన ధర్మంలో వేద ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు.మీరు ఎప్పుడు మానసిక సమస్యలతో బాధపడుతున్న లేదా మీ జీవితంలో గొప్ప విజయం సాధించాలనుకున్న నిజమైన హృదయంతో గాయత్రి దేవిని పూజించడం ఎంతో మంచిది.
ఇలా చేయడం వల్ల మీ పనులలో కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు.
రుణమాఫీపై తీపి కబురు అందేనా…?