అష్టమి రోజు ఇలా చేస్తే గ్రహ దోషాలు దూరమవడంతో పాటు ఇంకెన్నో ప్రయోజనాలు..
TeluguStop.com
ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు ఎంతో ప్రత్యక్షమైనవి.ఎందుకంటే హిందూ నూతన సంవత్సరం చైత్ర నవరాత్రుల నుంచే మొదలవుతుంది.
దేశవ్యాప్తంగా నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా ప్రజలందరూ జరుపుకుంటారు.నవరాత్రులలో రెండు ముఖ్యమైన రోజులు అష్టమి( Ashtami ), నవమి అని పండితులు చెబుతున్నారు.
ఈ రోజులలో కొంతమంది ప్రజలు కుటుంబాల్లోని పెళ్లి కావాల్సి ఉన్న ఆడపిల్లలను పూజిస్తారు.
పెళ్లి కావాల్సి ఉన్న ఆడపిల్లలను దుర్గా స్వరూపంగా భావిస్తారు.అయితే నవరాత్రులలో 8వ రోజున అమ్మ మహా గౌరీ( Mahagauri )ని పూజిస్తారు.
మహాగౌరీ నీ స్వచ్ఛత, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు.మహాష్టమి రోజు 9 చిన్న కుండలను ఏర్పాటు చేస్తారు.
వాటిలో దుర్గామాత యొక్క తొమ్మిది శక్తులను ఆవాహన చేస్తారు.అష్టమి ఆరాధన సమయంలో దుర్గామాత తొమ్మిది రూపాయలను పూజిస్తారు.
ఈ సంవత్సరం అష్టమి మార్చి 29న బుధవారం రోజు జరుపుకుంటారు.అంతేకాకుండా చేతిలో నవరాత్రులలో జగత్ జనని జగదాంబతో పాటు రాముడిని కూడా పూజిస్తారని పండితులు చెబుతున్నారు.
నవరాత్రులలో అష్టమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.గౌరీదేవిని ఆచార పద్ధతిలో పూజిస్తారు.
అష్టమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా గౌరీ మాత ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా పేదరికం నశించి, సుఖసంతోషాలు లభిస్తాయని చెబుతూ ఉంటారు.అయితే దుర్గామాత తామర పువ్వును ఎంతగానో ఇష్టపడుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
మహాష్టమి రోజున దుర్గామాత పాదాలకు 8 తామర పువ్వులు సమర్పించాలి.ఇలా చేస్తే మనిషి ప్రతి కోరిక నెరవేరుతుంది.
"""/" /
అంతేకాకుండా దుర్గాష్టమి( Durga Ashtami ) రోజున దుర్గా సప్తశతి పరాయణం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే దుర్గాష్టమి రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హారతి ఇవ్వాలి.అష్టమి, నవమి తిథి రోజు శాంతి హారతి ఇవ్వడం మంచిది.
దుర్గాష్టమి రోజున ఇంటి గుమ్మం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి.ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు, ఇంటి బాధలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది.
దుర్గాష్టమి రోజున తల్లికి 11 లవంగాలు సమర్పించడం ద్వారా ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి.
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు.. సింగర్ హారిక సంచలన వ్యాఖ్యలు వైరల్!